Sanchaita : ఏపీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సంచయిత… అశోక్ గజపతిరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ
మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండి పడ్డారు. సంచయిత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను
Vasireddy Padma : మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండి పడ్డారు. సంచయిత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని పద్మ ప్రశ్నించారు. ఆర్మీలో నియామకంపై సుప్రీంకోర్టే మహిళలను సమర్థించిందని, సంచయిత విషయంలో అశోక్ వ్యవహారంపై చర్చకు సిద్దమని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.
ఇలాఉండగా, ఇటీవల అశోక్ గజపతిరాజును మాన్సాస్, సింహాచలం ట్రస్టు చైర్మన్ గా పునర్ నియమించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజు తన ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో, ఓ మహిళనైన తనను అశోక్ గజపతిరాజు కించపరిచేలా మాట్లాడారంటూ సంచయిత గజపతి ఆరోపిస్తున్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఈ మేరకు ఆమె ఏపీ మహిళా కమిషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తన నియామకంతో పాటు తన వారసత్వాన్ని కూడా అవమానించే రీతిలో అశోక్ గజపతిరాజు మాట్లాడారని సంచయిత పేర్కొన్నారు. విశాఖలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసిన సంచయిత ఫిర్యాదు పత్రం అందించారు. దీనిపై స్పందించిన వాసిరెడ్డి పద్మ… అశోక్ గజపతిరాజుపై నిప్పులు చెరిగారు.
Read also : Thunder bolt : చనిపోయిన వ్యక్తిని ఖననం చేసి వస్తుండగా..పిడుగు రూపం లో వెంటాడిన మరణం