Thunder bolt : చనిపోయిన వ్యక్తిని ఖననం చేసి వస్తుండగా..పిడుగు రూపం లో వెంటాడిన మరణం
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం విస్సాపురంలో విధి వక్రించింది. ఒక వ్యక్తిని పొట్టనపెట్టుకోగా, మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది...
Thunder bold death : తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం విస్సాపురంలో విధి వక్రించింది. ఒక వ్యక్తిని పొట్టనపెట్టుకోగా, మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. విస్సాపురం గ్రామంలో ఈ ఉపద్రవం సంభవించింది. చనిపోయిన వ్యక్తిని ఖననం చేసి వస్తుండగా గాలి వాన బీభత్సం సృష్టించింది. అనంతరం భారీ వర్షం కురవడంతో వాళ్లు చెట్టుకిందకి వెళ్లారు. అయితే, అకస్మాత్తుగా పిడుగు వచ్చి చెట్టుమీద పడింది. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడ్డవాళ్లని గ్రామస్తులు చికిత్స నిమిత్తం గౌరీదేవిపేట ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
చెల్లెల్లు తన మాట వినలేదని దారుణానికి ఒడిగట్టిన అన్న..
తమిళనాడులో జరిగిన మరో దారుణం.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. వాట్సాప్ వాడుతోందని చెల్లినే నరికి చంపేశాడు ఓ అన్న. తూత్తుకుడి జిల్లా వాసవం పురంనగర్‌లో జరిగిన దారుణ హత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వాట్సాప్ వినియోగిస్తోందని.. సొంత చెల్లెల్ని చంపేయడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సుధలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ రైతుకు ఒక కుమారుడు మలైరాజా (20), కుమార్తె కవిత (17) ఉన్నారు.
కవిత ప్లస్ టూ చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా అన్‌లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే అన్న కొనిచ్చిన సెల్‌ఫోన్‌తో క్లాస్‌లు వినాల్సిన చెల్లెలు… వాట్సాప్‌లో వీడియోలు చూస్తూ చాటింగ్‌తో టైం వేస్ట్ చేస్తోందని తరచూ వార్నింగ్ ఇచ్చాడు. చాలా సార్లు హెచ్చరించినా కవిత తన అలవాటు మార్చుకోలేదు. కోపంతో రగిలిపోయిన మలైరాజా.. వాట్సాప్ చూస్తున్న టైంలోనే నరికి చంపేశాడు. చెల్లిని చంపిన తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.