Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: సీబీఐ బేసిక్‌ లాజిక్‌ను మర్చిపోయింది.. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే: సజ్జల

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా.. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివేకా కూతురు సునీతతోపాటు సీబీఐ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే సీబీఐ దర్యాప్తు పక్కదారి పట్టిందన్న సజ్జల కామెంట్స్‌ ఆసక్తి రేపుతున్నాయి.

Sajjala Ramakrishna Reddy: సీబీఐ బేసిక్‌ లాజిక్‌ను మర్చిపోయింది.. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే: సజ్జల
Sajjala Ramakrishna Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2023 | 7:16 AM

YS Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరు చేస్తున్న కామెంట్స్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వివేకా కేసు దర్యాప్తు తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో విష ప్రచారం చేయడంతోపాటు.. సీబీఐ చార్జిషీట్‌లో కల్పిత కథలే కనిపించాయన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి..

వివేకా కేసులో బేసిక్‌ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో చంద్రబాబు చేయాల్సిదంతా చేశారని ఆరోపించారు. సునీత చెప్పినవన్నీ అబద్ధాలేన్నారు సజ్జల. భారతి, తాను సునీత ఇంటికి వెళ్లలేదని.. వివేకా హత్య జరిగిన పది రోజుల తర్వాత మాత్రమే తన భార్యతో కలిసి పరామర్శించడానికి వెళ్లానని గుర్తుచేశారు.

మొత్తంగా.. వివేకా మర్డర్‌ కేసు సీబీఐ కీలక విషయాలను పక్కన బెట్టిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి. రెండు సిట్‌లు తేల్చిన అంశాలను పట్టించుకోకుండా.. కాల్‌ రికార్డింగ్స్‌ను సీబీఐ పరిగణనలోకి తీసుకోకుండా.. వాంగ్మూలాలను ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారని సజ్జల ఆరోపించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..