Vijayawada: బెజవాడలో భయంకరంగా ఓపెన్ నాలాలు.. ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోని వీఎంసీ అధికారులు..

వానాకాలం వచ్చిందంటే చాలు విజయవాడ లో ఓపెన్ నాలా ల్లో ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతుందోనని నగర వాసులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఇళ్ల మద్యలో నుంచే పెద్ద పెద్ద మురికి కాలువల ద్వారా వర్షపు నీరు పారుతుంటుంది. అయితే ఈ డ్రైనేజీలపై ఎలాంటి రక్షణ చర్యలూ కనపడవు. నగరం మధ్యలో నుంచి వెళ్తున్న ఈ ఓపెన్ డ్రైనేజి లు చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Vijayawada: బెజవాడలో భయంకరంగా ఓపెన్ నాలాలు.. ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోని వీఎంసీ అధికారులు..
Open Drainage
Follow us
S Haseena

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 25, 2023 | 10:03 PM

విజయవాడ న్యూస్, జులై 25: వానాకాలం వచ్చిందంటే చాలు విజయవాడ లో ఓపెన్ నాలాల్లో ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతుందోనని నగర వాసులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఇళ్ల మద్యలో నుంచే పెద్ద పెద్ద మురికి కాలువల ద్వారా వర్షపు నీరు పారుతుంటుంది. అయితే ఈ డ్రైనేజీలపై ఎలాంటి రక్షణ చర్యలూ కనపడవు. నగరం మధ్యలో నుంచి వెళ్తున్న ఈ ఓపెన్ డ్రైనేజి లు చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

విజయవాడ నగరంలో ఉన్న ఓపెన్ నాలాలు వర్షాకాలంలో డేంజర్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఏకధాటిగా ఒక్కరోజు వర్షం పడినా భారీగా నీరు వచ్చి చేరుతుంది. కొన్నాళ్ళక్రితం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి డ్రైనేజీ లు పొంగి ప్రవహించాయి. ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తున్న ఓపెన్ నాలా లో పడి ఐదేళ్ల చిన్నారి మృత్యువాత చెందాడు. అయినా సరే వీఎంసీ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదు. చిన్నారి మృతి చెందిన తర్వాత కూడా తమ తప్పు లేదని నగరపాలక సంస్థ అధికారులు చెప్పుకోచ్చారు. కనీసం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని కూడా చెప్పలేదు. పైగా వర్షపు నీరు పారడం కోసమే ఓపెన్ నాలా ఏర్పాటు చేసినట్లు సమర్దించుకున్నారు.

డ్రైనేజి లపై రక్షణ చర్యలు సూన్యం..

వర్షపు నీటి కోసం నిర్మించిన ఈ ఓపెన్ నాలాలపై ప్రమాదాలు జరగకుండా కనీసం రక్షణ చర్యలు చేపట్టడం లేదు.డ్రైనేజి లకు ఇనుప మెస్ లతో కూడిన మూతలు ఏర్పాటు చేయడం, ఇళ్ల మధ్యలో వెళ్తున్న దగ్గర రెండు వైపులా మెస్ లు ఏర్పాటు చేస్తే కనీసం అక్కడ డ్రైనేజి ఉందనే విషయం తెలుస్తుంది. ఓపెన్ నాలాలు మూసి వేయడం వల్ల వర్షపు నీరు భారీగా వస్తే రోడ్లమీదకి,ఇళ్ల లోకి నీరు చేరిపోతుందని అధికారులు చెప్తున్నారు. కానీ చాలా చోట్ల భవన నిర్మాణాలు జరిగిన ప్రాంతంలో డ్రైనేజిని మూసి వేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయినా అలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టని వీఎంసీ అధికారులు.. ప్రజల ప్రాణాలు తీస్తున్న డ్రైనేజీలపై రక్షణ చర్యలు చేపట్టడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓపెన్ నాలాల విషయంలో అధికారుల తీరుపై నగరవాసులు మండిపడుతున్నారు. ఎప్పుడు ఎవరు నాలాలకు బలి అవుతారో అని బొక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరింతమంది ప్రాణాలు కోల్పోకముందే అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..