Andhra Pradesh: మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రముఖ ప్రవచకులు గరికపాటి.. వివాదం ఎక్కడ రాజుకుందంటే..?

AP News: గరికపాటి నరసింహారావు. ప్రవచనాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి వ్యక్తికి తలనొప్పిగా మారింది ఓ ఓల్డ్‌ వీడియో. దాని కారణంగా గరికపాటి సారీ చెప్పాల్సి వచ్చింది. మరి ఆ వీడియోలో ఏముంది?

Andhra Pradesh: మళ్లీ వార్తల్లోకెక్కిన ప్రముఖ ప్రవచకులు గరికపాటి.. వివాదం ఎక్కడ రాజుకుందంటే..?
Garikipati Narasimha Rao
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2022 | 8:34 AM

Garikapati Narasimha Rao: మళ్లీ వార్తల్లోకెక్కారు ప్రముఖ ప్రవచకులు గరికపాటి నరసింహారావు. ఈసారి ఆయన మాటలపై మరో వివాదం చెలరేగింది. ఆ వివాదానికి కారణమైంది ఒక ఓల్డ్‌ వీడియో. గరికపాటి నరసింహారావు తమపై చేసిన కామెంట్స్‌పై ఇప్పడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వర్ణకారులు. గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం(Jangareddigudem) పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు స్వర్ణకారులు. వెంటనే తమకి క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు స్వర్ణకారులు. గరికపాటి భీమవరం(Bhimavaram) పర్యటన నేపథ్యంలో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో ఇష్యూ సీరియస్‌గా మారింది. వివాదం ముదరడంతో దిగొచ్చారు గరికపాటి నరసింహారావు. స్వర్ణకారులకు క్షమాపణ చెప్పారాయన. తాను ఎవరినీ కించపరచాలని మాట్లాడలేదని, విశ్వ బ్రాహ్మణులకు బాధకలిగితే, తనకు బాధ కలిగినట్టే అని చెప్పారు. చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానని చెప్పారాయన. దీంతో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగినట్టేనని భావిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు గరికపాటి కామెంట్స్‌ వివాదాలకు దారితీశాయి. ఇటీవల కూడా పుష్ప సినిమాపై ఫైర్‌ అయ్యారు గరికపాటి. ఒక స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏంటీ అంటూ ప్రశ్నించారు గరికపాటి నరసింహారావు. కాగా గరికపాటి వీడియోలు యూత్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆయన ప్రవచన వీడియోలు నిత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి.

Also Read: ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే