Traffic Police: మీరు కూడా అధిక సౌండ్ చేసే సైలెన్సర్స్ వినియోగిస్తున్నారా..? ఒక్కసారి ఈ సీన్ చూడండి

ఓవర్ స్పీడ్ తో పాటు, సౌండ్ ఎక్కువ చేస్తున్న టూవీలర్స్ పై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఆకతాయిలు బండి సైలెన్సర్ మారుస్తూ.. శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు.

Traffic Police: మీరు కూడా అధిక సౌండ్ చేసే సైలెన్సర్స్ వినియోగిస్తున్నారా..? ఒక్కసారి ఈ సీన్ చూడండి
అధిక శబ్ధాలు చేసే వాహనలపై పోలీసుల కొరఢా
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 11, 2021 | 6:20 PM

ఓవర్ స్పీడ్ తో పాటు, సౌండ్ ఎక్కువ చేస్తున్న టూవీలర్స్ పై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఆకతాయిలు బండి సైలెన్సర్ మారుస్తూ.. శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు. విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులకూ చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇతర వాహనదారుల అటెన్షన్ డైవర్ట్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా చర్యలకు పాల్పడే వారికి కాకినాడ పోలీసులు గుబ గుయ్యిమనేలా షాకిచ్చారు.

ఎక్కువ శబ్ధం కలిగించే వాహనాల సైలెన్సర్లను డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా పోలీసులు చెక్ చేశారు. 80 డెసిబుల్స్ పైన శబ్ధం చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. 50 వాహనాల సైలెన్సర్‌లు బైక్స్ నుంచి పీకించారు. వాటిని రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు.

ప్రత్యేక సైలెన్సర్ లను అమర్చిన బుల్లెట్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అధిక శబ్దం వచ్చే బులెట్ వాహనాల నుండి సైలెన్సర్ లను తొలగించి ఇలా రోడ్డు రోలర్ తో తొక్కించారు. సైలెన్సర్స్ విక్రయించే షాపులు, సైలెన్సర్ బిగించే మెకానిక్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీఎస్పీ వరప్రసాద్ హెచ్చరించారు.

కేవలం కాకినాడ పరిసర ప్రాంతాలలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు ఇదే తరహా చర్యలకు పాల్పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా అతిగా సౌండ్ చేసే సైలెన్సర్లతో రోడ్డుమీదకు వచ్చేస్తున్నారు. దీంతో కాకినాడ పోలీసుల మాదిరిగా అన్ని చోట్లా స్పెషల్ డ్రైవ్స్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Also Read:

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం.. మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!