Watch Video: వామ్మో.. వైజాగ్‌లో భయపెడుతున్న సముద్రం.. భారీగా కెరటాలు చొచ్చుకొచ్చి..

విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు.. భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా.. వాస్తవానికి, పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటుపోట్లు సహజం.. కానీ.. సాధారణ రోజుల్లో కూడా ఆటుపోట్లు పెరుగుతుండటం, అలలు చొచ్చుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది..

Watch Video: వామ్మో.. వైజాగ్‌లో భయపెడుతున్న సముద్రం.. భారీగా కెరటాలు చొచ్చుకొచ్చి..
Vizag Beach
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 17, 2024 | 3:32 PM

విశాఖపట్నంలో సముద్రం భయపెడుతోంది.. కొన్నాళ్లు శాంతించి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. గత రెండు మూడు రోజులుగా ముందుకు చొచ్చుకు వస్తోంది సముద్రం.. దీంతో కొన్నిచోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది.. విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న బీచ్ సందర్శకులను భయపెడుతోంది. అక్కడ సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్ ఎరినాకు తాకుతున్నాయి కెరటాలు. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి.

విశాఖ అంటే టక్కున ఆర్కే బీచ్ గుర్తుకు వస్తుంది.. దీనికి తోడు రుషికొండ బీచ్, భీమిలి బీచ్ కూడా ఉన్నాయి. ఈ తీర ప్రాంతం దాదాపుగా 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సందర్శకులు ఎవరైనా విశాఖ వచ్చారంటే కచ్చితంగా ఆర్కే బీచ్ సందర్శనకు ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాతే ఋషికొండ, భీమిలి..! అయితే ఇప్పుడు సందర్శకులకు ఆర్కే బీచ్ భయపడుతోంది.

రక్షణ కోసం వేసిన ఐరన్ మెస్ ధ్వంసం చేసేలా..

ఇన్నాళ్లు ఎక్కడో చోట అప్పుడప్పుడు తీరం కోతకు గురయ్యేది. సబ్ మెరైన్ మ్యూజియం, నో హోటల్ ఎదురుగా ఉన్న బీచ్, సాగర్ నగర్ ఋషికొండ ప్రాంతాల్లోనూ కోతకు గురయ్యేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగినప్పటికీ.. తాజాగా విక్టరీ ఎట్ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. ఆదివారం పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగింది. ఆర్కే బీచ్ ఏరియాలో సందర్శకులు సేద జరిగినందుకు కొన్నిచోట్ల కోకోనట్ ఎరీనాలు ఏర్పాటు చేశారు అధికారులు. తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోకుండా.. ఉండేందుకు ఇసుకతో పాటు పెద్ద పెద్ద రాళ్లను పేర్చి వాటికి ఐరన్ మెస్ ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్రరూపంతో.. ఆ ఐరన్ మెస్ ను తాకి.. అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా.. మెస్ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ఐరన్ మెస్ ను ధ్వంసం చేసేలా ఉంది. దీంతో మెస్ లోపల కొబ్బరి చెట్ల రక్షణ కోసం ఏర్పాటుచేసిన బండ రాళ్లు సైతం బీచ్ కెరటాల వైపు కొట్టుకు వెళ్తున్నాయి. ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

వీడియో చూడండి..

ఈ సీజన్లో అంతేనా..?

వాస్తవానికి విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు.. భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా. పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటుపోట్లు సహజం. దాంతోపాటు ఈ సీజన్ లో సముద్రపు కరెంట్ ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశ వైపుకు వెళుతూ ఉంటాయి. సెప్టెంబరు మధ్య మాసం నుంచి జనవరి రెండో వారం వరకు కెరటాల కరెంట్ తీవ్రత ఆ విధంగా ఉంటుందని అంటున్నారు సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు. దీనికి తోడు సముద్రంలో వరుస అల్పపీడనాలు వాయుగుండం ప్రభావం కూడా కెరటాలపై పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం కూడా కెరటాల ఉదృతికి కారణమై ఈ విధంగా తీరం కోతకు గురవుతుందంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్త ఎం వి ఎస్ శర్మ..

నివారణ చర్యలు తీసుకున్నా..

ఇటీవల సముద్రం కోతకు గురైన సందర్భాల్లో భారీగా సముద్రంలో ఉన్న ఇసుకను తీరంపై వేసేవారు. వైజాగ్ పోర్ట్ ప్రత్యేకంగా దీనికోసం ఆర్థిక భారాన్ని భరించి ఇసుకను డ్రెడ్జింగ్ చేసేది. హుదూద్ సమయంలో కెరటాలు ఆర్కే బీచ్ రోడ్డు పైకి వచ్చాయి.. ఆ సమయంలో భారీగా తీరం కోతకు గురవడంతో నివారణ చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ సముద్రుడి ఉగ్రరూపం ముందు ఆ చర్యలన్ని తాత్కాలికంగానే మిగిలిపోయాయి. అయితే గతంలో చేసిన డ్రెడ్జింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ గా వేసిన ఇసుక మళ్ళీ సముద్రం తన సహజ సిద్ధంగా సముద్రంలోనికి కలిపేసుకుంటుందని అంటున్నారు మరి కొంతమంది నిపుణులు. అయితే.. తీరం కొత్త శాశ్వత నివారణకు వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక పనులకు, ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తూ.. కోస్టల్ ఎరోసన్ ప్రాజెక్టుకూ ప్రతిపాదన కేంద్రానికి పంపింది. 200 కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, VMRDA 90:10 నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళికలో సిద్ధం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏఐ జెమినీ 2.0 రిలీజ్‌ చేసిన గూగుల్‌.. ఇక ఆ సమస్యలకు చెక్‌
ఏఐ జెమినీ 2.0 రిలీజ్‌ చేసిన గూగుల్‌.. ఇక ఆ సమస్యలకు చెక్‌
TGPSC గ్రూప్‌ 2 పరీక్షలకు 45.57 శాతమే హాజరు.. భారీగా డుమ్మా!
TGPSC గ్రూప్‌ 2 పరీక్షలకు 45.57 శాతమే హాజరు.. భారీగా డుమ్మా!
క్రిస్టల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయి..
క్రిస్టల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయి..
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
విక్రమార్కుడు 'టెన్నిసు బంతుల పాప' దుమ్మురేపుతుందిగా..!!
విక్రమార్కుడు 'టెన్నిసు బంతుల పాప' దుమ్మురేపుతుందిగా..!!
విశాఖలో భయపెడుతున్న సముద్రం.. భారీగా కెరటాలు చొచ్చుకొచ్చి..!
విశాఖలో భయపెడుతున్న సముద్రం.. భారీగా కెరటాలు చొచ్చుకొచ్చి..!
మీ లివర్ పాడవకుండా క్లీన్‌గా ఉండాలంటే వీటిని తింటే చాలు..
మీ లివర్ పాడవకుండా క్లీన్‌గా ఉండాలంటే వీటిని తింటే చాలు..
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!