AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆర్జీవీ నోట నాడు ఆ మాట.. నేడు ఈ మాట.. ఈ దెబ్బకు ఎన్ని ట్రోల్స్ వస్తాయో..

వ్యూహం.. ఇందులో పాత్రల గురించి ఏపీ రాజకీయాలు తెలిసిన వాళ్లందరికీ బాగా తెలుసు. కాకపోతే.. సెకండ్‌ పార్ట్‌ ట్రైలర్ లాస్ట్‌ సీన్‌ గురించే స్టేట్‌ మొత్తం డిస్కస్‌ చేసుకుంటోంది. ఒకప్పుడు అంటే.. 2019కి ముందు పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు చాలా అభిమానం అనే వారు వర్మ. అదే మాట టీవీ9 బిగ్‌ డిబేట్‌లో కూడా చెప్పారు. కానీ, అది గతం.. ఇప్పుడు కాదు.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ అంటే వర్మ లైట్ తీసుకుంటారు. అలా ఎందుకంటే..

Andhra Pradesh: ఆర్జీవీ నోట నాడు ఆ మాట.. నేడు ఈ మాట.. ఈ దెబ్బకు ఎన్ని ట్రోల్స్ వస్తాయో..
Ram Gopal Varma
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2023 | 9:24 AM

Share

రామ్‌ గోపాల్‌ వర్మ.. డిఫరెంట్‌ డైరెక్టర్‌.. ఎన్ని సినిమాలు పోయినా.. సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌.. తాజాగా తన ఫోకస్.. ఏపీ రాజయాలపై పెట్టారు. వ్యూహం పేరుతో సినిమా తీస్తున్నారు. ట్రైలర్లతోనే తనేంటో చూపిస్తున్నారు. కాకపోతే వర్మకు ఒకప్పుడు పవన్‌ కల్యాణ్‌ అంటే విపరీతమైన అభిమానం. ఇప్పుడు జగన్‌ మాత్రమే తనకు నచ్చుతారట. 2019కి ముందు పవన్‌ను వీరావేశంతో సోషల్‌మీడియాలో పొగిడిన వర్మ.. 2019 తర్వాత టార్గెట్‌ పవన్‌ అనేలా ఎందుకు మారారు.. వ్యూహం సినిమా ట్రైలర్‌లోనే వర్మ ఫోకస్‌ అంటే ఏంటో అర్థమైపోయింది..

ఆర్జీవీ అంటే బోల్డ్‌ సినిమాల డైరెక్టర్‌.. పబ్లిసిటీ చేసుకోవడంలో బాహుబలి.. సోషల్‌ మీడియాలో సోది కామెంట్లు పెడతాడు.. వివాదాల ప్రేమికుడు అనుకుంటారంతా.. కానీ ఆయనలోని లోతైన అవగాహన.. ప్రతి అక్షరం.. ప్రతి పదంపై తనకున్న స్పష్టమైన విజన్‌.. దగ్గరి వాళ్లకు తప్ప ఎవరికీ అర్థం కాదు. వర్మ కొంతకాలంగా డబ్బా సినిమాలు తీస్తున్నారనే వాళ్లే.. వ్యూహం ట్రైలర్లు చూశాక.. దటీజ్‌ వర్మ అంటున్నారు.

వ్యూహం.. ఇందులో పాత్రల గురించి ఏపీ రాజకీయాలు తెలిసిన వాళ్లందరికీ బాగా తెలుసు. కాకపోతే.. సెకండ్‌ పార్ట్‌ ట్రైలర్ లాస్ట్‌ సీన్‌ గురించే స్టేట్‌ మొత్తం డిస్కస్‌ చేసుకుంటోంది. ఒకప్పుడు అంటే.. 2019కి ముందు పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు చాలా అభిమానం అనే వారు వర్మ. అదే మాట టీవీ9 బిగ్‌ డిబేట్‌లో కూడా చెప్పారు. కానీ, అది గతం.. ఇప్పుడు కాదు.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ అంటే వర్మ లైట్ తీసుకుంటారు. అలా ఎందుకంటే.. పవన్‌లో నిజాయితీ ఉన్నా.. నిలకడ లేదనేది వర్మ వాదన.

ఇవి కూడా చదవండి

అలాగని 2019 ఎన్నికల తర్వాతి నుంచి పవన్‌ కల్యాణ్‌ మారిపోయారా.. అదేమో కానీ.. ఆ మధ్య పవన్‌ కల్యాణ్‌ కూడా ఏపీ సీఎంపై రకరకాల ట్వీట్లు చేశారు. వీటికి వర్మ కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. జగన్‌పై పవన్‌ ఎలాంటి కామెంట్‌ పెట్టినా.. వెంటనే వర్మ కౌంటర్‌ ఇచ్చేవారు. దీంతో పవన్‌పై వర్మకు అభిమానం తగ్గిందా? అని ఫ్యాన్స్‌ కూడా రివర్స్‌ అయ్యారు. తమ పవర్‌ స్టార్‌ను కామెంట్‌ చేసిన వర్మను వదులుతామా అని సోషల్‌ మీడియాలో ఆయన్ను ఏకిపారేస్తున్నారు. అయితే ఇవన్నీ వర్మ పట్టించుకోరు. ఏం చేయాలనుకున్నారో.. ఏం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పడం మాత్రమే వర్మకు తెలుసు.

తాజాగా వర్మ వ్యూహం సినిమా తీస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్‌ గురించేనని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వర్మ సీఎం జగన్‌ను నేరుగా కలిసి, తాను రాసిన కథ, తీసిన విధానాన్ని కూడా ముఖ్యమంత్రికి చూపించారు. సలహాలు, సూచనలు తీసుకుని వ్యూహం సినిమాను అత్యంత వ్యూహాత్మకంగా చెక్కుతున్నారు. తాజాగా రెండో పార్ట్‌ టీజర్ కూడా రిలీజైంది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పాత్ర గురించి చంద్రబాబు పాత్ర చెప్పే మాటలు సంచలనం రేపుతున్నాయి.

అయితే పవన్‌ను విపరీతంగా అభిమానించిన వర్మ.. పవన్‌ తీరు నచ్చక కటీఫ్‌ చెప్పి, ఇప్పుడు జగన్‌ను ఇష్టపడుతున్నారట. అదీ వర్మ మనసులోని మాట.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎలాంటి విషయమైనా.. ఏ మాత్రం మొహమాటం లేకుండా కుండ బద్ధలు కొట్టడం వర్మకే చెల్లుతుంది. ఇప్పుడు వ్యూహం సినిమాతో పవన్‌ ఫ్యాన్స్‌ చేతుల్లో ఇంకెంత ట్రోల్ అవుతారో మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..