AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ఆలస్యం.. అసలు కారణం ఇదేనా..?

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌లపై వాయిదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొద‌టి విడ‌త అభ్యర్ధుల‌ను ప్రక‌టించిన ఇరు పార్టీల అధినేత‌లు, ఆ జాబితాలో చోటు ద‌క్కని ఆశావ‌హులు, అసంతృప్త నేత‌ల‌ను బుజ్జగించే ప‌నిలో ప‌డ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి ఎక్కువ మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించింది. మొద‌టి విడ‌త‌లో 94 మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించారు తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు. ఆయా స్థానాల్లో చోటు ద‌క్కని కొంత మంది నేత‌లు అసంతృప్తి వ్యక్తం చేయ‌డంతో వారిని ఉండ‌వ‌ల్లి నివాసానికి పిలిచి స‌ర్ధిచెప్పారు చంద్రబాబు.

AP News: టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ఆలస్యం.. అసలు కారణం ఇదేనా..?
Pawan Chandrababu
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Feb 29, 2024 | 1:13 PM

Share

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌లపై వాయిదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొద‌టి విడ‌త అభ్యర్ధుల‌ను ప్రక‌టించిన ఇరు పార్టీల అధినేత‌లు, ఆ జాబితాలో చోటు ద‌క్కని ఆశావ‌హులు, అసంతృప్త నేత‌ల‌ను బుజ్జగించే ప‌నిలో ప‌డ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి ఎక్కువ మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించింది. మొద‌టి విడ‌త‌లో 94 మంది అభ్యర్ధుల‌ను ప్రక‌టించారు తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు. ఆయా స్థానాల్లో చోటు ద‌క్కని కొంత మంది నేత‌లు అసంతృప్తి వ్యక్తం చేయ‌డంతో వారిని ఉండ‌వ‌ల్లి నివాసానికి పిలిచి స‌ర్ధిచెప్పారు చంద్రబాబు. ఇలా చంద్రబాబు బుజ్జగించిన వారిలో అన‌కాప‌ల్లి టీడీపీ ఇంచార్జి పీలా గోవింద్, తెనాలి ఇంచార్జి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్, తంబ‌ళ్లప‌ల్లె టీడీపీ ఇంచార్జి శంక‌ర్ యాద‌వ్, పెనుగొండ ఇంచార్జి పార్ధసార‌ధి వంటి నేత‌ల‌ను పిలిచి స‌ర్ధిచెప్పి పంపించారు. ఇక కొన్నిచోట్ల టీడీపీకి కాకుండా జ‌న‌సేన‌కు టిక్కెట్లు కేటాయించండంపైనా ప‌సుపు పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఇలా సుమారు 15 మంది ఆశావ‌హుల‌తో నేరుగా చంద్రబాబు మాట్లాడి ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించి నచ్చజెప్పారు. మ‌రికొంత మంది ఆశావ‌హుల‌తో కూడా చంద్రబాబు స్వయంగా మాట్లాడ‌నున్నారు. అయితే మొద‌టి విడ‌త‌లో తెలుగుదేశం పార్టీ 94 స్థానాల‌కు అభ్యర్ధులు ప్రక‌టించింది. జ‌న‌సేన 5 స్థానాల‌కు అభ్యర్ధుల‌ను ప్రక‌టించింది. అయితే బీజేపీతో పొత్తులు, సీట్ల స‌ర్ధుబాటు కోసం తెలుగుదేశంపార్టీ ఎదురుచూస్తోంది. త్వర‌లోనే పొత్తుల‌కు సంబంధించి స్పష్టత వ‌స్తే ఏయే స్థానాలు బీజేపీకి కేటాయించాల‌ని అనే దానిపై స్పష్టత రానుంది. బీజేపీతో పొత్తు పై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం అప్పటివ‌ర‌కు మేనిఫెస్టో విడుద‌ల కూడా వాయిదా వేయ‌నుంది. పొత్తుపై క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాతే మిగిలిన మిగిలిన స్థానాలు, మేనిఫెస్టోపై ప్రక‌ట‌న చేయనున్నాయి రెండు పార్టీలు.

టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి మేనిఫెస్టోకు ఆటంకాలు..

ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల అధినేత‌లు చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‎లు అనేక‌సార్లు చ‌ర్చించారు. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుప‌ర‌చాల‌నే దానిపై ఇరు పార్టీల అధినేత‌లు దాదాపు ఒక నిర్ణయానికి వ‌చ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూప‌ర్ సిక్స్ పేరుతో ఆరు హామీల‌ను మేనిఫెస్టోలో పొందుప‌రిచింది. గ‌తేడాది రాజ‌మండ్రిలో జ‌రిగిన మ‌హానాడులోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆరు హామీల‌ను మినీ మేనిఫెస్టోగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆరు హామీల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్తున్నారు టీడీపీ నేత‌లు, కార్యక‌ర్తలు. టీడీపీ పొందుప‌రిచిన ఆరు హామీల‌కు అద‌నంగా ష‌ణ్ముఖ వ్యూహం పేరుతో జ‌న‌సేన కూడా ఆరు ప్రతిపాద‌న‌ల‌ను జోడించింది. అయితే గ‌త విజ‌య‌ద‌శ‌మి నాటికే మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని స్వయంగా చంద్రబాబు ప్రక‌టించారు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు, చంద్రబాబుపై కేసులు, జ‌న‌సేనతో పొత్తులతో మేనిఫెస్టో ప్రక‌ట‌న వాయిదా ప‌డింది. చంద్రబాబు-ప‌వ‌న క‌ళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో‎పై క్లారిటీకి వ‌చ్చిన‌ప్పటికీ ఇంకా వాయిదా ప‌డుతూనే ఉంది. దీనికి కార‌ణం బీజేపీతో పొత్తుల అంశ‌మే అంటున్నారు టీడీపీ నేత‌లు. ఇప్పటికే సీట్ల స‌ర్ధుబాట విషయంలో బీజేపీ కోసం ఎదురచూస్తున్నాయి రెండు పార్టీలు. అయితే బీజేపీతో పొత్తుల‌పై క్లారిటీ వ‌స్తే సీట్లను స‌ర్ధుబాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మేనిఫెస్టోలో కూడా బీజేపీకి సంబంధించిన అంశాలు పొందుప‌ర‌చాల్సి ఉంటుంది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల కూడా వాయిదా ప‌డుతుంద‌నేది తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల వాద‌న‌. పొత్తు ఖ‌రార‌యిన‌ట్లయితే మేనిఫెస్టోపై ఆ పార్టీతో చ‌ర్చించాలి. ఏయే అంశాల‌తో ప్రజ‌ల‌కు హామీలు ఇవ్వాల‌నే దానిపై అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ త‌ర్వాతే పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టీడీపీ-జ‌న‌సేన మేనిఫెస్టో విడుద‌ల త‌ర్వాత బీజేపీతో జ‌త‌క‌డితే మ‌ళ్లీ మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి మేనిఫెస్టో విడుద‌ల వాయిదా వేస్తున్నట్లు టీడీపీ నేత‌లు ప్రక‌టిస్తున్నారు. వ‌చ్చే వారంలోగా పొత్తులపై స్పష్టత వ‌స్తుంద‌ని.. ఆ త‌ర్వాతే మేనిఫెస్టో విడుద‌ల ఉంటుందని చెబుతున్నారు ఇరుపార్టీల ముఖ్య నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..