YSRCP: కురుక్షేత్రాన్ని పోలిన సెటప్‌తో ఎన్నికల ప్రచారం.. శ్రీకృష్ణుడుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..
వచ్చే ఎన్నికలను ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు వర్గాలు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర యుద్దంతో పోలుస్తున్నాయి. రానున్న ఎన్నికల యుద్దంలో పాండవులైన తమదే విజయమని ఇప్పటికే సిఎం జగన్ ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ కలసి కౌరవుల్లా యుద్దానికి వస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమదే విజయం అంటూ సీఎం జగన్ శంఖారావం పూరించారు. ఇప్పుడు జిల్లాల స్థాయిలో కూడా నేతలు అదే బాటలో పయనిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట ఎంపి అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రకటించారు.

వచ్చే ఎన్నికలను ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు వర్గాలు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర యుద్దంతో పోలుస్తున్నాయి. రానున్న ఎన్నికల యుద్దంలో పాండవులైన తమదే విజయమని ఇప్పటికే సిఎం జగన్ ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ కలసి కౌరవుల్లా యుద్దానికి వస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమదే విజయం అంటూ సీఎం జగన్ శంఖారావం పూరించారు. ఇప్పుడు జిల్లాల స్థాయిలో కూడా నేతలు అదే బాటలో పయనిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట ఎంపి అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రకటించారు. దీంతో ఆయన నెల్లూరు నుండి పల్నాడు వచ్చారు. నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ లోక్ సభ స్థానంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఆయన విజయం సాధిస్తారన్న భావనతో నెల్లూరు నుండి ఆయన్ను నర్సరావుపేట పంపడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ మాకు శ్రీ కృష్ణుడి వంటి వాడని ఇప్పటికే నేతలు చెబుతూ వస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలను కలిసికట్టుగా విజయంవైపు అనిల్ తీసుకెళ్లాలని అంటున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు అమరావతి మండలం నెమలికల్లులో ఆయన పర్యటనలో ఆసక్తికరం పరిణామం చోటు చేసుకుంది.
గ్రామస్థులు ఆయన్ను గుర్రపు రథంపై ఊరేగించారు. అంటే ఆయన సారధ్యం వహిస్తుండగా ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు రథంలో ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో యాదవుడైన అనిల్ కుమారే తమ రథసారధి అంటూ ఎమ్మెల్యేతో పాటు స్థానికులు నినాదాలు చేశారు. ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గుర్రపు రథాన్ని స్వారీ చేసుకుంటూ గ్రామంలో పర్యటించారు. అనంతరం పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అభిమానులు అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంపై బోలేడు ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా తన మనస్థత్వానికి నచ్చే ప్రాంతానికే జగన్ పంపించాడంటూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అనిల్ కుమార్ అభిమానులు, వైసిపి కార్యకర్తలు కూడా కురు క్షేత్రంలో శ్రీ కృష్ణుడి రథ సారధ్యంలాగే అనిల్ యాదవ్ నాయకత్వంలో పార్లమెంట్‌తో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలో విజయం సాధిస్తామంటున్నారు. అనిల్ సారధ్యం విజయతీరాలకు చేరుస్తుందో లేదో తెలియాలంటే మరో రెండు నెలల సమయం ఆగాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




