AP News: ఆ జిల్లాలో అందరూ పుష్పరాజ్‌లే.. దొరికినకాడికి దొరికినంత దండుడే.. సంచలన విషయాలు

సినిమాలో ఒక్కడే పుష్పరాజ్‌.. ఆ జిల్లాలో అడుగడుగుకో పుష్పరాజ్‌ ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదగా దొరికే రెడ్‌ శాండల్‌ను యధేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అటు అటవీశాఖ, ఇటు పోలీస్‌ శాఖ స్మగ్లర్ల ఆటకట్టించడంలో ఫెయిల్యూర్‌ అవుతున్నాయి.

AP News: ఆ జిల్లాలో అందరూ పుష్పరాజ్‌లే.. దొరికినకాడికి దొరికినంత దండుడే.. సంచలన విషయాలు
Red Sandal Wood Photos
Follow us

|

Updated on: Sep 12, 2024 | 8:40 PM

సినిమాలో ఒక్కడే పుష్పరాజ్‌.. ఆ జిల్లాలో అడుగడుగుకో పుష్పరాజ్‌ ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదగా దొరికే రెడ్‌ శాండల్‌ను యధేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అటు అటవీశాఖ, ఇటు పోలీస్‌ శాఖ స్మగ్లర్ల ఆటకట్టించడంలో ఫెయిల్యూర్‌ అవుతున్నాయి. ఎన్ని చెక్‌ పోస్టులు పెట్టినా.. ఎర్ర చందనం దుంగలను ఎగరేసుకుపోతున్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం పుష్కలంగా దొరుకుతుంది. మీరు ఎన్ని అడ్డుంకులు సృష్టించినా తగ్గేదేల్యా అంటున్నారు స్మగ్లర్లు..

కడప జిల్లాలో మూడు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతముంది. అందులో రెండు లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం విస్తరించి ఉన్నది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అత్యంత అరుదైన, విలువైన ఎర్ర చందనం జిల్లా అటవీ విస్తీర్ణంలో మూడువ వంతు విస్తరించి ఉన్నదని. అందులోనూ లంకమల, పాలకొండలు, శేషాచలం అడవులు మూడు అటవీ ప్రాంతాలూ కడప జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ దొరికే ఎర్రచందనంపైనే స్మగ్లర్ల కన్ను. ఎంతో మంది అక్రమార్కులు విలువైన ఎర్ర చందనాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. కడప జిల్లా పోలీస్‌ శాఖ, అటవీశాఖ సిబ్బంది, విజిలెన్స్‌ తనిఖీల్లో ప్రతి రోజూ ఎర్ర చందనం అక్రమ రవాణా పట్టుబడుతూనే ఉన్నది. అయినా రోజూ స్మగ్లింగ్‌ మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

ఇవి కూడా చదవండి

విజిలెన్స్‌ శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో స్మగ్లర్ల ఎత్తుగడలు వెలుగు చూస్తున్నాయి. మూడు నెలల క్రితం పోలీస్‌ సిబ్బంది ట్రాన్స్‌పోర్ట్‌ కారులను అద్దెకు తీసుకుని స్మగ్లర్లకు అప్పచెప్పి ఎర్రచందనం రవాణాకు సహకరించిన వైనం బయటపడింది. రెండు నెలల క్రితం అటవీశాఖకు సంబంధించిన కొంత మంది వాచర్లు అటవీ సంపదకు కాపలాగా ఉండాల్సింది పోయి హాయిగా ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ దొరికిపోయారు. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లోని అటవీ భాగంలో ఎర్ర చందనం ఎక్కువగా ఉన్నది. లంకమల, పాలకొండలు, నల్లమల శేషాచలం అడవులు ఇవన్నీ కూడా కడప పరిసర ప్రాంతాలు కావడంతో ఈ నియోజకవర్గాల్లోని పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి ఇదే ఆదాయ వనరుగా మారిపోయింది. స్మగ్లర్లతో చేతులు కలిపి హాయిగా అక్రమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

కడప జిల్లాలో 9 ఫారెస్ట్‌ రేంజ్‌లు ఉన్నాయి. కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట, బద్వేలు, ప్రొద్దుటూరు, ముద్దనూరు, వనిపెంట, పోరుమామిళ్ల, వేంపల్లెలో ఫారెస్ట్ రేంజ్‌లున్నాయి. ఎర్ర చందనం పరిరక్షణకు ఇద్దరు సబ్‌ డీఎఫ్‌వోలు ఉంటారు. స్వ్కాడ్‌ డివిజన్‌ కూడా ఉంటుంది. ఎర్ర చందనాన్ని పరిరక్షించేందుకు 2వందలకు పైగా అటవీ సిబ్బంది పని చేస్తుంటారు. ఇవిగాక 27 బేస్‌ క్యాంపులున్నాయి. ఒక్కో బేస్‌ క్యాంపులో ఐదుగురు చొప్పున ప్రొటెక్షన్‌ వాచర్లు ఉంటారు. వీరంతా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కాకుండా పెట్రోలింగ్‌ చేస్తుంటారు. జిల్లాలో మొత్తమ్మీద 9 చెక్‌ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్‌ఈబీ, పోలీస్‌ శాఖ నిఘా కూడా ఉంటుంది. పగటి పూట బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుంది. నైట్‌ టైం కూడా పెట్రోలింగ్‌ చేస్తూ ఉంటారు. ఇలా ఎంత గట్టి నిఘా పెట్టినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాత్రం ఆగడం లేదు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇదే విషయాన్ని కడప డీఎఫ్‌వోను అడిగితే.. లంకమల, పాలకొండల్లో ఎంత నిఘా ఉంచినా.. ఎంట్రీ పాయింట్స్‌ ఎక్కువగా ఉన్నాయని, ఫారెస్ట్‌ ఏరియాల్లో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తే చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పారు. ఈ ఏడాది రెడ్‌ శాండల్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌లో కూడా డ్రోన్లను ప్రపోజ్‌ చేశామన్నారు. డ్రోన్‌ వాడటం వల్ల ఎంత మంది స్మగ్లర్లు ఉన్నారనేది సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఎర్రచందనం రవాణాలో ఫారెస్ట్‌ సిబ్బంది సహకారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలో కొంత మంది సిబ్బందిపై యాక్షన్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి కడప జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్‌పీని అడిగితే.. టాస్క్‌ఫోర్స్‌ టీం పనిచేస్తుందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తున్నానమని, ఫారెస్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామన్నారు. పాత స్మగ్లర్లపై నిఘా పెట్టామని, జైలుకు వెళ్లి వచ్చిన వారందరినీ పిలిచి కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని తెలిపారు. ఎర్రచందనం మీద కంటిన్యూగా నిఘా పెట్టి అక్రమ రవాణాలో పోలీసు సిబ్బది పాత్ర ఉన్నట్టు తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని పెద్దలు ఊరికే చెప్పలేదు.. నిఘా వ్యవస్థలున్నా స్మగ్లింగ్‌ ఆగడం లేదంటే అందుకు ముమ్మాటికి ఇంటిదొంగల సహకారమన్నది సుస్పష్టం. ఈ నిజాన్ని ఎంత త్వరగా గుర్తించి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటే అంత మంచిది. లేదంటే పుష్పరాజులే రూల్‌ చేసే ప్రమాదముంది.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రష్యా అధ్యక్షులు పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ..!
రష్యా అధ్యక్షులు పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ..!
అంజీర్​లను ఇలా తీసుకుంటే ఒంట్లో షుగర్​ దెబ్బకు నార్మల్..​!
అంజీర్​లను ఇలా తీసుకుంటే ఒంట్లో షుగర్​ దెబ్బకు నార్మల్..​!
బడ్జెట్‌లో సూపర్‌ ఫీచర్లు.. మార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్
బడ్జెట్‌లో సూపర్‌ ఫీచర్లు.. మార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్
ఇకపై నో లవ్.! ఓన్లీ కెరీర్ అండ్ మూవీస్ అంటున్న శ్రుతి హాసన్..
ఇకపై నో లవ్.! ఓన్లీ కెరీర్ అండ్ మూవీస్ అంటున్న శ్రుతి హాసన్..
భారీ పొట్టతో ఇబ్బందిగా ఉందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..
భారీ పొట్టతో ఇబ్బందిగా ఉందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..
ఆ జిల్లాలో అడుగడుగుకో పుష్పరాజ్.. దొరికినకాడికి దొరికినంత దండుడే
ఆ జిల్లాలో అడుగడుగుకో పుష్పరాజ్.. దొరికినకాడికి దొరికినంత దండుడే
35కోట్ల సార్లు ‘రామ’నామం.. వందల పుస్తకాలు ఫుల్.. వేల పెన్నులునిల్
35కోట్ల సార్లు ‘రామ’నామం.. వందల పుస్తకాలు ఫుల్.. వేల పెన్నులునిల్
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు ఊహించని రేటింగ్
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు ఊహించని రేటింగ్
చిన్నారి చిదిమేసిన కేసులో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు!
చిన్నారి చిదిమేసిన కేసులో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు!
తారక్‌ మాటలతో దేవరపై కాన్ఫిడెన్స్ డబుల్‌.. అస్సలు మిస్ అవ్వదు.!
తారక్‌ మాటలతో దేవరపై కాన్ఫిడెన్స్ డబుల్‌.. అస్సలు మిస్ అవ్వదు.!
అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.
అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.
నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..
నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..
కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!
మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.
మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.
చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??
ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??