Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Mushroom: బాబోయ్‌.. రాక్షస పుట్టగొడుగు..! తిన్నారంటే అంతే సంగతులు..!!

West Godavari District News: ఇలాంటి పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరతమైనవి కూడా ఉంటాయట. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఒక భారీ పుట్టగొడుగు అందరిని ఆకర్షిస్తుంది. మెంటేవారి తోటలో నివాసముంటున్న మహమ్మద్ సరోజినీ తమ కుటుంబంతో కలిసి వారి స్థలంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి స్థలంలో రోడ్డు పక్కన మెరుస్తూ తెల్లగా కనిపిస్తుండడంతో అక్కడికి వెళ్లి చూశారు. అది ఒక పెద్ద పుట్టగొడుగు. సుమారు రెండు కేజీలు ఉన్న పుట్టగొడుగులు చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ పుట్టగొడుగును తీసుకుని రైతు బజార్ లోనికి వెళ్లారు.

Big Mushroom: బాబోయ్‌.. రాక్షస పుట్టగొడుగు..! తిన్నారంటే అంతే సంగతులు..!!
Big Mushroom
Follow us
B Ravi Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Aug 21, 2023 | 5:57 PM

ఏలూరు, ఆగస్టు 21: వర్షాకాలం రాగానే అక్కడక్కడ మనకు పుట్టగొడుగులు దర్శనమిస్తాయి. చూడడానికి తెల్లగా, మెరుస్తూ అందంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాంటి పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరతమైనవి కూడా ఉంటాయట. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఒక భారీ పుట్టగొడుగు అందరిని ఆకర్షిస్తుంది. మెంటేవారి తోటలో నివాసముంటున్న మహమ్మద్ సరోజినీ తమ కుటుంబంతో కలిసి వారి స్థలంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి స్థలంలో రోడ్డు పక్కన మెరుస్తూ తెల్లగా కనిపిస్తుండడంతో అక్కడికి వెళ్లి చూశారు.

అది ఒక పెద్ద పుట్టగొడుగు. సుమారు రెండు కేజీలు ఉన్న పుట్టగొడుగులు చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ పుట్టగొడుగును తీసుకుని రైతు బజార్ లోనికి వెళ్లారు. అక్కడి వ్యాపారస్తులు ఆ పుట్టగొడుగులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద పుట్టగొడుగు ఎప్పుడు మార్కెట్ కి రాలేదని దీని విలువ 700 నుండి 900 రూపాయలు వరకు ఉంటుందని వ్యాపారస్తులు వారితో చెప్పారు.

ఆ పుట్టగొడుగును అక్కడనుండి ఇంటికి తీసుకు వచ్చేసారు మహమ్మద్ సరోజిని. ఇంత భారీ సైజులో ఏర్పడిన పుట్టగొడుగును ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పుట్టగొడుగులు సాధారణంగా 100 గ్రాములు వరకు ఉంటాయని, భారీగా పెరిగిన వాటిలో విష పదార్థాలు ఉంటాయని అంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి లోని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మల్లికార్జునరావు.

భారీ సైజులో ఉన్న పుట్టగొడుగులను తినకూడదని సూచిస్తున్నారు. పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచిదని ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. పుట్టగొడుగుల మీద అవగాహన లేకుండా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

విషం కలిగిన పుట్టగొడుగులు ఇవే..

మనకు కనిపించే పుట్టగొడుగులు అన్నీ మంచివి కావు. ఇందులో 70 నుంచి 80 రకాల పుట్టగొడుగులు చాలా విషపూరితమైనవి. ఈ ప్రాణాంతకమైన శిలీంధ్రాలు ఉన్నాయి. చూడటానికి ఒకేలా ఉన్నా.. ఇందులో కొన్ని ప్రాణాలను తీసేవి కూడా ఉన్నాయి. బహుశా అన్ని పుట్టగొడుగులలో ప్రాణాంతకమైనవి అని చెప్పలేము. ఇలాంటి విషపూరితమైనవి ఐరోపా అంతటా కనిపిస్తాయి. తినదగిన గడ్డి పుట్టగొడుగులు, సీజర్ పుట్టగొడుగులను దగ్గరగా పోలి ఉంటాయి. వీటిని తింటే శరీరమంతా కణాలను త్వరగా దెబ్బతీస్తాయి. తిన్న తర్వాత 6 నుంచి 12 గంటలలోపు కడుపు నొప్పి, వాంతులు, రక్తపు విరేచనాలు అవుతాయి. దీని వలన కణజాలం నుంచి ద్రవం వేగంగా వ్యాప్తి చెందుతుంది. మష్రూమ్ టాక్సిన్స్ అనేది ఫంగస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ద్వితీయ జీవక్రియలు .

ముఖ్యంగా 20 రకాల పుట్టగొడుగులు..

చాలా మందికి మార్కెట్లో కనిపించే ప్రసిద్ధ బటన్ లేదా పోర్టోబెల్లో పుట్టగొడుగుల గురించి మాత్రమే తెలుసు. కానీ తినడానికి పనికొచ్చేవి అనేక రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో మనం ముఖ్యంగా 20 రకాల పుట్టగొడుగుల తినేటివి ఉన్నాయి. ఇతర రకాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, తక్కువ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను పెంచడానికి వాటి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగపడతాయి.

వీడియోను ఇక్కడ చూడండి

రుచిని పెంచేందుకు మాత్రమే కాదు..

పుట్టగొడుగులు 90 శాతం నీటితో తయారవుతాయి. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం.. కండగల, బీజాంశం-బేరింగ్ ఫలాలు కాస్తాయి. ఇది నేలపై లేదా దాని ఆహార వనరుపై పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇప్పుడు అనేక వంటకాల్లో.. ముఖ్యంగా చైనీస్, కొరియన్, యూరోపియన్, జపనీస్ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అనేక రకాల పుట్టగొడుగులతో రుచికరమైన వంటకాలు చేయవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న రకాలతో చాలా రకాల వంటలను సిద్ధం చేస్తారు. పుట్టగొడుగులు వాటి జనాదరణకు కేవలం వాటి ఆహ్లాదకరమైన రుచి మాత్రమే కాకుండా వాటిలో లభించే పోషకాహార ప్రొఫైల్‌పై ఆదారపడి ఉంటాయి. అన్ని తినదగిన పుట్టగొడుగులు మీకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం