AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అందమైన పనిమనిషి.. నమ్మారంటే మీ ఇల్లు హుష్‌ఖాకీ

మాయమాటలు చెప్పి వంట, ఇతర పనుల నిమిత్తం ఇంట్లో పాగా వేస్తుంది. టైం చూస్కుని యాక్షన్‌లోకి దిగిపోతుంది. జైలు శిక్ష అనుభవించి వచ్చినా కూడా తీరు మార్చుకోకుండా తన మార్క్ ప్రవర్తనతో పోలీసులకు సవాల్ విసిరింది.

AP News: అందమైన పనిమనిషి.. నమ్మారంటే మీ ఇల్లు హుష్‌ఖాకీ
Jagadambha
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2024 | 7:39 AM

Share

అందమైన పనిమనిషి.. వయసు మళ్లినవారు ఉండే ఇళ్లలోనే ఎక్కువగా పనిచేస్తుంది. కొద్దికాలంలోనే ఇంట్లో మనిషిగా కలిసిపోతుంది. మంచి అదును చూసి మత్తుమందు ఇచ్చి.. ఇళ్లంతా గుళ్ల చేసి ఎస్కేప్ అవుతుంది. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈమెపై 18 కేసులు ఉన్నాయి. 10 కేసుల్లో నేరం ప్రూవ్ అయ్యి.. జైలుకు వెళ్లి వచ్చింది. అయినా కూడా తీరు మారలేదు. తాజాగా ఈమె మరోసారి పోలీసులకు చిక్కింది. ఆ వివరాలను డీఎస్పీ భవ్యకిషోర్‌… రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు.

మేడం గారి పేరు… నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్‌ బుజ్జి. ఊరు కోనసీమ జిల్లా అంగర. పెళ్లి అయింది కానీ భర్త చాన్నాళ్ల క్రితమే మరణించాడు. ప్రజంట్ రాజమండ్రి రూరల్‌ బొమ్మూరులో ఉంటోంది. వయసుమళ్లినవారితో పరిచయం పెంచుకుని.. డబ్బు తక్కువ ఇస్తానన్న సరే వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. కొద్ది కాలంలోనే తన పనితనంతో ఆ ఇంట్లోవారి నమ్మకాన్ని చూరగొంటుంది. తర్వాత కొన్నాళ్లకు అన్నంలో, టీ, కాపీ, ప్రసాదం వంటి వాటిల్లో హైడోస్ మత్తు మందు కలిపి ఇస్తుంది. వారు ఘాడ నిద్రలో ఉండగా… ఒంటిపై నగలతోపాటు ఇంట్లోని గోల్డ్, డబ్బుతో ఉడాయిస్తుంది. చోరీ చేసిన బంగారాన్ని బ్యాంకులు లేదా ప్రవేట్ ఫైనాన్స్ వాళ్ల వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకుంటుంది.  కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం తదితర పోలీసు స్టేషన్లలో ఈమె నిందితురాలిగా ఉంది. ఈ తరహా చోరీలపై వరస ఫిర్యాదులు అందడంతో అలెర్టన పోలీసులు.. ఈ మహిళతో జాగ్రత అని ఆమె ఫోటోతో జనాల్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 18న ఆమెను పట్టుకున్నారు

పలు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఈమె 2021 విడుదలైంది. అయినా తీరు మార్చుకోకుండా..  తిరిగి అదే తరహా చోరీలకు పాల్పడుతోంది. ఆరు కేసులకు సంబంధించిన 273.8 గ్రాముల గోల్డ్‌ ఆమె నుంచి సీజ్ చేసినటగ్లు డీఎస్పీ తెలిపారు. నిందితురాలిని పట్టుకోవడంలో.. చతురత చూపిన సిబ్బందిని అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..