MLA MS Babu: ‘నాలుక కోస్తాం..’ అంటూ అయ్యన్న పాత్రుడుకి వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హెచ్చరిక
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు వార్నింగ్ ఇచ్చారు. నాలుక కోస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు
TDP vs YCP: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు వార్నింగ్ ఇచ్చారు. నాలుక కోస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు గూండాగిరి చేయిస్తున్నారని బాబు ఆరోపించారు. సీఎం జగన్ పై నోరు పారేసుకుంటే ఊరుకోం… అంటూ పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఊగిపోయారు.
ఇలా ఉండగా, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై వైసీపీ నేతల ముప్పేట దాడి కొనసాగుతోంది. అయ్యన్నపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత, బడుగు, బలహీనవర్గాలపై వివక్షత ఉందని, ఇందుకు నాటి చంద్రబాబు పాలనలో దళితులకు జరిగిన అవమానకర సంఘటనలే నిదర్శమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు.
దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనను అందిస్తోన్న ముఖ్యమంత్రి వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాపాలన చూసి ఓర్వలేకే ఆయనపై టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారని పార్థసారథి చెప్పుకొచ్చారు.