TMC: బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు.. టీఎంసీలోకి కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, క్యూలో మరింతమంది.!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో ఇవాళ టీఎంసీ పార్టీలో చేరారు. అభిషేక్ బెనర్జీ సమక్షంలో
Bengal Politics: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో ఇవాళ టీఎంసీ పార్టీలో చేరారు. అభిషేక్ బెనర్జీ సమక్షంలో సుప్రియో తృణమూల్ కండువా కప్పుకున్నారు. బీజేపీకి రాజీనామా అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సుప్రియో.. ఇలా షాకిచ్చారు. ఈ మధ్య కాలంలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి తృణమూల్‌లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా, మరికొంతమంది బీజేపీ నేతలు తమ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ నేత కునల్ ఘోష్ మరో బాంబు పేల్చారు. బీజేపీలో వారు సంతృప్తిగా లేరని.. ఒకరు (బాబుల్ సుప్రియో) శనివారంనాడు టీఎంసీలో చేరారని, ఆదివారంనాడు ఇంకొకరు పార్టీలో చేరాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ చేరికల ప్రక్రియ వచ్చే రోజుల్లోనూ కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
ఇక, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు కేంద్ర క్యాబినెట్ నుంచి ఆయన రాజీనామా చేశారు. కొద్ది వారాల తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు కొందరు బీజేపీ నేతలతో అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని కూడా ఆయన అప్పట్లో సంచలన ప్రకటన చేశారు.
Read also: దేశ భద్రతకు ప్రమాదకరం.. విపత్తుగా మారబోతున్నాడు. సిద్ధూపై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు