AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని హనుమాన్ సర్కిల్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. దొరికిన వ్యక్తిని చూసి పోలీసులు షాక్ అయ్యారు.

భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
Priest Caught Smuggling Ganja In Guntakallu
Nalluri Naresh
| Edited By: |

Updated on: Oct 14, 2025 | 7:23 PM

Share

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని హనుమాన్ సర్కిల్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే దొరికి వ్యక్తుల గురించి ఆరా తీసి, ఎక్సైజ్ పోలీసులే షాక్ అయ్యారు.

వృత్తి అర్చకత్వం.. చేసే ఉద్యోగం దేవుడి గుడిలో పూజారి. ప్రవృత్తి మాత్రం గంజాయి అక్రమ రవాణా.. సీన్ కట్ చేస్తే గంజాయి అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయాడు ఈ పూజారి. గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న బైకును సీజ్ చేశారు.

అరెస్ట్ అనంతరం నిందితులను విచారించిన ఎక్సైజ్ పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడ్డ మోహన్ సుందర్ పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. అతను గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామంలో ఉన్న దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. మరో నిందితుడు సాయికుమార్ గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరూ కలిసి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పక్కా సమాచారం రావడంతో ముందస్తుగా ఎక్సైజ్ పోలీసులు రెక్కీ నిర్వహించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

దేవాలయంలో పూజారిగా ఉంటూ మోహన్ సుందర్ గంజాయి విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే నిందితులు గంజాయిని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఎంతకాలంగా ఈ వ్యాపారం చేస్తున్నారు..? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారా? అన్న విషయం పూర్తి విచారణలో మాత్రమే తెలుస్తుందని ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు. గుడికి వచ్చే భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటి అనుకుంటున్నారు పోలీసులు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..