Anandayya Medicine: మరో వివాదంలో ఆనందయ్య మందు.. నోటీసులు జారీ చేసిన కలెక్టర్.. వారం రోజుల గడువు..!
Anandayya Medicine: కరోనా మందుతో ఫేమస్ అయిన నెల్లూరు ఆనందయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య సిద్ధం చేసిన మందుపై రగడ కొనసాగుతోంది.
Anandayya Medicine: కరోనా మందుతో ఫేమస్ అయిన నెల్లూరు ఆనందయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య సిద్ధం చేసిన మందుపై రగడ కొనసాగుతోంది. ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ చెబుతుంటే.. ఊళ్లో మందు పంపిణీ చేయొద్దంటూ కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. రోగులు మందు కోసం వస్తే.. తమకు ఇక్కడ కరోనా రాదా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు. దాంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో మందు పంపిణీ చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. పర్మిషన్ లేకుండా మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఆనందయ్య ఇచ్చే మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది గ్రామానికి వస్తారని.. స్థానికులు భయపడుతున్నారు. దీనివల్ల తమకూ కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్టు.. అసత్య ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడుతున్నారు స్థానిక జనం. గ్రామస్తుల ఆందోళనలతో ఆనందయ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఐతే మందు పంపిణీకి కోర్టు అనుమతి ఉందంటున్నారు ఆనందయ్య. కరోనా నుంచి రక్షణ పొందేందుకు మందు కోసం చాలా మంది వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. అయితే, మందు పంపిణీని అడ్డుకుంటే తనకెలాంటి ఇబ్బందీ లేదనీ.. ప్రజలకే నష్టం జరుగుతుందని చెబుతున్నారు ఆనందయ్య.
ప్రభుత్వ నోటీసులు.. ఇదిలాఉంటే.. ఆనందయ్య వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆనందయ్యకు నోటీసులు జారీ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్. ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కోరారు. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశించారు. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Also read:
Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..
Visakha Agency: ఆ తవ్వకాలు అందుకోసమేనా?.. విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టిస్తున్న గోతులు..