KA Paul: స్పెషల్ స్టేటస్.. స్పెషల్ ప్యాకేజ్ తీసుకురండి.. పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ సవాల్..
చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాటల తూటలను సంధించారు. బీజేపీ మద్దతు ఉండి కూడా స్పెషల్ ప్యాకేజీ తీసుకొని రావడంలో పవన్ కల్యాణ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు, జూలై 17: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న ఐదు సవంత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాటల తూటలను సంధించారు. బీజేపీ మద్దతు ఉండి కూడా స్పెషల్ ప్యాకేజీ తీసుకొని రావడంలో పవన్ కల్యాణ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు శాతం ఓటింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు.. 30శాతం ఓటింగ్ ఉందని కొన్ని మీడియా సంస్థలు విషప్రచారం ప్రచారం చేస్తున్నాయని ఫైరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు, డాన్సులు చేసి తీసుకొస్తావా.. ప్యాకేజీ తీసుకొని ఎందుకు నోరు మెదపడం లేదంటూ విమర్శించారు.
స్పెషల్ స్టేటస్.. స్పెషల్ ప్యాకేజ్ కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ హామీ ఇచ్చారు కేఏ పాల్. మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అవకాశం ఇస్తే రూ. 20లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ నెల 19వ తేదీన ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న సమావేశంలో ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ డిమాండ్ చేయాలని పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు కేఏ పాల్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం