Pawan Kalyan: తిరుపతి ఎస్పీని కలిసిన పవన్ కళ్యాణ్.. సీఐ అంజు యాదవ్‌పై ఫిర్యాదు.
జనసేప అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన పార్టీ నేత కొట్టుసాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు పవన్‌కల్యాణ్. సీఐ అంజు యాదవ్ తీరును తప్పుబడుతూ బాధితుడు కొట్టు సాయితో కలిసి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు...
జనసేప అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన పార్టీ నేత కొట్టుసాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు పవన్‌కల్యాణ్. సీఐ అంజు యాదవ్ తీరును తప్పుబడుతూ బాధితుడు కొట్టు సాయితో కలిసి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. 20 నిమిషాల పాటు ఎస్పీతో భేటీ అయ్యారు. కార్యకర్తలు తప్పు చేయకున్నా సీఐ దురుసుగా ప్రవర్తించారని సీఐ తీరుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు పవన్‌కల్యాణ్.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో జరిగిన తమ పార్టీ నేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఎస్పీకి పిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. సీఐ అంశాన్ని సుమోటోగా తీసుకున్నందుకు HRCకి ధన్యవాదాలు తెలిపారు పవన్. క్రమశిక్షణగా ఉంటామని ప్రభుత్వానికి మాటిస్తున్నాం.. మీరుకూడా అధికారాన్ని ఇష్టారాజ్యంగా వాడొద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు పవన్.
సీఐ అంజుయాదవ్‌పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసే సమయంలో గలాటా జరిగిందని, అడ్డుకునే క్రమంలో ఈ సంఘటన జరిగిందని దీనిపై ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు ఎస్పీ. ఇప్పటి వరకు ఎలాంటి చార్జి మెమో ఇవ్వలేదు.. కేవలం HRC నుంచి మాత్రమే నోటీస్ అందిందన్నారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..