Andhra pradesh: ప్రాణం తీసిన ఫోన్ లౌడ్ స్పీకర్.. అసలేం జరిగిందంటే.
కాల్ రాగానే కొంతమంది లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడటం అలవాటు.. మరికొంతమంది లౌడ్ స్పీకర్ పెట్టడమే కాదు, గట్టిగా మాట్లాడటం కూడా అలవాటు..! ఇదే విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చింది. లౌడ్ స్పీకర్ డిస్టబెన్స్ ఘర్షణ కు కారణమై ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగుండం సమీప రామవరం కు చెందిన అక్కిరెడ్డి...
కాల్ రాగానే కొంతమంది లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడటం అలవాటు.. మరికొంతమంది లౌడ్ స్పీకర్ పెట్టడమే కాదు, గట్టిగా మాట్లాడటం కూడా అలవాటు..! ఇదే విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చింది. లౌడ్ స్పీకర్ డిస్టబెన్స్ ఘర్షణ కు కారణమై ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగుండం సమీప రామవరం కు చెందిన అక్కిరెడ్డి బంగార్రాజుకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలవాటుగా రోడ్డుమీదకు ఫోన్ పట్టుకుని వచ్చ్చాడు. ఇంటి ఎదుట రోడ్డుపై లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడుకుంటూ వస్తున్నాడు బంగార్రాజు. అయితే.. అదే సమయంలో స్నేహితుడు రమణతో ద్విచక్ర టూ వీలర్ పై అటుగా వెళ్తున్నడు యారాడకు చెందిన బాక్సర్ బంక అజయ్ (33).
అప్పుడే అజయ్‌కి కూడా కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతున్నాడు. పక్కనే లౌడ్ స్పీకర్‌లో బిగ్గరగా బంగార్రాజు మాట్లాడుతుందాడంతో ఇబ్బంది పడ్డాడు అజయ్. ‘తనకు కూడా ఫోన్ వచ్చిందని, అలా లౌడ్ స్పీకర్ పెట్టుకుని అంతగట్టిగా మాట్లాడ్డమేంటంటూ బాక్సర్ అజయ్.. బంగార్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.’ ‘నా ఊళ్లో నేను నా ఇంటి దగ్గర మాట్లాడితే నీకెందుకు అని అజయ్ కు బదులిచిచ్చాడు బంగార్రాజు. దీంతో అజయ్‌కి కోపం వచ్చి బిగ్గరగా అరిచాడు. తమ గ్రామానికి వచ్చి తమపైనే దురుసుగా మాట్లాడతారా అంటూ బంగార్రాజు కూడా ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఘర్షణకు దారి తీయడంతో అజయ్‌ని స్నేహితుడు వారించాడు. ఈ లోగా.. బంగార్రాజు భార్య, మామ భీమవరపు దేముడు (49) కూడా బాక్సర్ అజయ్‌ను ప్రశ్నించేందుకు బయటకు వచ్చారు. దీంతో.. అజయ్ మరింత ఊగిపోతూ బంగార్రాజు, దేముడిపై దాడి చేశాడు. దీంతో దేముడు కుప్పకూలీ ప్రాణాలు కోల్పోయాడు.
చిన్న విషయానికే ఇరు వర్గాల మధ్య గొడవ జరగడం, ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆ ఘటన సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునామని అన్నారు సీఐ రామచంద్రరావు. కేవలం లౌడ్ స్పీకర్ తో మాట్లాడినందుకు వివాదం మొదలై దాడిలో దేముడు ప్రాణాలు కోల్పోయినట్టు తమ విచారణలో తెలిందన్నారు. అయితే.. నిండితుడు బాక్సర్ కావడంతో కొట్టిన దెబ్బకు కుప్పకూలిపోయాడు దేముడు. అల్లుడు బంగార్రాజుకు స్వాల్ప గాయ్యాలయ్యాయి. ఇద్దరి మధ్య చిన్న విషయం కోసం ఘర్షణ.. ఏ పాపం ఎరుగని మూడో వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..