Avanigadda: ఇదొక అంతుచిక్కని మిస్టరీ.. హత్యా లేక ఆత్మహత్యా…? అసలు మృతదేహం ఎక్కడ?
అవనిగడ్డ కరకట్టపై ప్రమాదం... కాల్వలోకి దూసుకెళ్లిన కారు... గల్లంతైన అందులోని వ్యక్తి... ఆధార్ కార్డే ఆధారం.. ఇదొక అంతుచిక్కని మిస్టరీ. హత్యా లేక ఆత్మహత్యా...? జరిగింది ప్రమాదమే ఐతే మృతదేహం ఎక్కడ? పోలీసులేమంటున్నారు.. కుటుంబీకుల వెర్షన్ ఎలా ఉంది?
Krishna District, 17th July: గాజుల రత్నభాస్కర్ కేరాఫ్ అవనిగడ్డ.. ఐస్ ఫ్యాక్టరీ ఓనర్. ఆదివారం సాయంత్రం పనిమీద కారులో బైలుదేరారు. తెల్లారేసరికి అవనిగడ్డ కరకట్ట పక్కన పంటకాల్వలో కారు ఉంది.. అతడు లేడు. స్థానికులు గమనించి 100కి డయల్ చేసి పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అంతుచిక్కని చిక్కుప్రశ్నలు. కారును కాల్వనుంచి బైటికి తీసి.. అందులో ఉన్న వస్తువుల్ని సీజ్ చేశారు.
విజయవాడ వైపు వెళుతూ ఒక్కసారిగా మలుపుతిరిగి వేగంగా కాల్వలోకి దూసుకుపోయినట్టు ఘటనాస్థలంలో ఆనవాళ్లున్నాయి. ఎదురుగా వస్తున్న హెవీ వెహికల్స్‌ని తప్పించబోయి అదుపు తప్పిందా… లేక నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందా… అంతకుమించి ఏదైనా మిస్టరీ ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు.
డ్రైవర్ సీటు పక్కన విండో డోర్ ఓపెనై ఉండడం అనుమానాలకు తావిస్తోంది. రాత్రి 2 గంటల సమయంలో కూతురికి లొకేషన్ షేర్ చేశారు రత్న భాస్కర్. కానీ.. పెట్టిన లొకేషన్‌కీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధం లేదు. ఆదివారం సాయంత్రం కూడా టీడీపీ ఆఫీస్‌లో ఒక మీటింగ్‌కి ఎటెండయ్యారట రత్నభాస్కర్. ఏమైనా ఆర్థిక తగాదాలున్నాయా, రాజకీయ గొడవలున్నాయా అని ఆరా తీస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం