అడవిలో ఆ అలజడి అందుకేనా..? పోలీసుల నగదు బహుమతి ప్రకటించిన ఎందుకోసం…
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న అల్లూరి ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి రేగుతుంది. భద్రతా బలగాలు కుంబింగును ముమ్మరం చేశాయి. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సంచారం ఉందన్న సమాచారంతో అప్రమత్తమయ్యాయి బలగాలు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌పై నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. వాహనాలు తనిఖీ చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న అల్లూరి ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి రేగుతుంది. భద్రతా బలగాలు కుంబింగును ముమ్మరం చేశాయి. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సంచారం ఉందన్న సమాచారంతో అప్రమత్తమయ్యాయి బలగాలు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌పై నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. వాహనాలు తనిఖీ చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
మావోయిస్టుల ఫోటోలతో కూడిన..
మావోయిస్టు యాక్షన్ టీం సంచారం సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 13 మంది మావోయిస్టు కీలక నాయకుల ఫోటోలతో కూడిన పోస్టర్ను రిలీజ్ చేశారు పోలీసులు. సమాచారం ఇస్తే నగదు రివార్డు ఇస్తామంటూ పోలీసుల ప్రకటన చేశారు. ఐదు నుంచి పది లక్షల వరకు రివార్డును అందించి వివరాలకు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. ‘ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో సంచరిస్తున్న మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సమాచారం తెలిపిన వారికి ఐదు నుంచి పది లక్షల నగదు బహుమతి ఇవ్వబడును.’ అని ఆ పోస్టర్లలో ఉన్న సారాంశం.
మావోయిస్టుల మాటలు గిరిజనులు నమ్మడం లేదు.. ఎస్పీ తుహిన్ సిన్హా
అనుమానితుల కదలికలపై ఆరాతీస్తున్నారు. వారపు సంతలపై నిఘా పెంచారు పోలీసులు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు పిలుపునిచ్చినా.. అల్లూరు ఏజెన్సీలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. యాక్షన్ టీం సభ్యుల సంచారం సమాచారంతో పోస్టర్లు వేసామని.. ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లో పాటు ప్రజలకు కూడా అప్రమత్తం చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నామని టీవీ9 తో అన్నారు ఎస్ పి తుహిన్ సిన్హా. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సమాచారం అందించిన వారి వివరాలు గోపంగా ఉంచి.. నగదు బహుమతి అందిస్తామని చెబుతున్నారు. అందరి సహకారంతో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని.. మావోయిస్టుల ఐడియాలజీని వదిలి గిరిజనులు స్వచ్ఛందంగా ఓటు వేశారని అన్నారు ఎస్పీ. ఏజెన్సీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరికొన్ని రోజుల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అందుకోసం ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు అయితే.. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీలో యాక్షన్ టీం సభ్యుల సంచార సమాచారం కలవరపాటుకు గురిచేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




