IMD Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు..!

ఉత్తరతమిళనాడు-దక్షిణకోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం(మే 24) ఉదయానికి మధ్యబంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనావేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 

IMD Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు..!
IMD Alert
Follow us
Janardhan Veluru

|

Updated on: May 22, 2024 | 5:44 PM

ఉత్తరతమిళనాడు-దక్షిణకోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం(మే 24) ఉదయానికి మధ్యబంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనావేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

దీని ప్రభావంతో గురువారం (మే 23) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (మే 24) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మ రాజు, ఏలూరు, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.

రేపు శ్రీకాకుళం 9, విజయనగరం 5 , పార్వతీపురంమన్యం 11, అల్లూరిసీతరామరాజు కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 40.6°C, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40.3°C, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, నెల్లూరు జిల్లా రాపూరులో 40.2°C, విజయనగరం శృంగవరపుకోటలో 39.9°C, శ్రీకాకుళం జిల్లా గంగువారిసగడాం, వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల, ఖాజీపేటలో 39.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!