AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నగరవనం చెరువులో అంతుచిక్కని మిస్టరీ.. ఆ పర్యాటక ప్రాంతంపై పోలీసుల నిఘా..

కర్నూలు నగర శివారులలోని నందికొట్కూరు రోడ్డులో నగరవనం పక్కనే ఉన్న చెరువులో మూడు మహిళల మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. మొదట రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. హిజ్రాల మృతదేహాలుగా తొలుత భావించారు. వీరికి కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం లభ్యమయింది. హిజ్రాలు కాదని గుర్తించారు. ఇద్దరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. ఓ మహిళ ఒంటిపై స్వల్ప గాయాలు ఉన్నాయి. మీరు ఎవరు అనేది ఇంతవరకు అంతు పట్టడం లేదు.

Watch Video: నగరవనం చెరువులో అంతుచిక్కని మిస్టరీ.. ఆ పర్యాటక ప్రాంతంపై పోలీసుల నిఘా..
Kurnool Nagaravanam
J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: May 20, 2024 | 1:23 PM

Share

కర్నూలు నగర శివారులలోని నందికొట్కూరు రోడ్డులో నగరవనం పక్కనే ఉన్న చెరువులో మూడు మహిళల మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. మొదట రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. హిజ్రాల మృతదేహాలుగా తొలుత భావించారు. వీరికి కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం లభ్యమయింది. హిజ్రాలు కాదని గుర్తించారు. ఇద్దరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. ఓ మహిళ ఒంటిపై స్వల్ప గాయాలు ఉన్నాయి. మీరు ఎవరు అనేది ఇంతవరకు అంతు పట్టడం లేదు. వయసు 40 నుంచి 45 ఏళ్ల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు జాగిలాలతో పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతవరకు ఎలాంటి వివరాలు ఆధారాలు లభ్యం కాలేదు.

తెలంగాణ వాళ్లు అయి ఉండొచ్చని కోణంలో కూడా విచారిస్తున్నారు. మృతదేహాలు లభ్యం కావడంతో జిల్లాలో మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీస్తున్నారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలించినా కూడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. స్వయంగా డిఐజి విజయరావు సహా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి శాస్త్రీయంగా సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేసి చెరువులో పడేశారా అనేది అంతుచిక్కడం లేదు. నగరవనం పర్యాటక ప్రాంతం కావడంతో రాత్రి వరకు సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముగ్గురిదీ ఒకే కుటుంబమే నా లేక వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారా అనేది తేలడం లేదు. మృతదేహాలను పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరింట్లోనైనా మహిళలు మిస్సింగ్ అయి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…