- Telugu News Photo Gallery Spiritual photos TTD Chairman Bhumana Karunakar Reddy organize Tatayagunta Gangamma Jatara in Tirupati.
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు..
తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతరలో 5వ రోజు మాతంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంత వీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర జరిగింది. అందులో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్, తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పాల్గొన్నారు. వివిధ రూపాలు, వేషధారణలు, కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పురవీధుల్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
Raju M P R | Edited By: Srikar T
Updated on: May 20, 2024 | 12:38 PM

తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. జాతరలో 5వ రోజు మాతంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంత వీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర జరిగింది. అందులో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్, తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పాల్గొన్నారు.

వివిధ రూపాలు, వేషధారణలు, కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పురవీధుల్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. తిరుపతి తొలి గడప అయిన అనంత వీధి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్నూలు వీధి, రామచంద్ర పుష్కరిణి, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం పోలీస్ స్టేషన్, గాంధీ రోడ్డు, బండ్ల వీధి ప్రాంతాల మీదుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంది.

భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుకోగా జాతర ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రను నిర్వహించే సంప్రదాయం గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో స్థానిక అనంతవీధిలో గంగమ్మకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని, వేపాకు ధరించి మాతంగి వేషంతో పాటు పౌరాణిక వేష ధారణలో పాల్గొన్నారు.

నవదుర్గలు, తప్పేటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులి వేషాలు, గరగల్లు, బోనాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం శోభాయాత్ర ద్వారా చేశామన్నారు టీటీడీ చైర్మన్ భూమన. ఆలయ పునర్నిర్మాణం తర్వాత గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోందన్నారు.

బ్రహోత్సవాల తరహాలో వైభవోపేతంగా జాతర కొనసాగుతుందన్నారు. భవిష్యత్లో మరింత గొప్పగా జాతర నిర్వహిస్తామన్న భూమన గత 3 ఏళ్లుగా శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ భక్తి మొక్కులు తీర్చుకుంటున్నారన్నారు. ఇక జాతరలో మంగళవారం 6వ రోజు సున్నపు కుండల వేషం ధరించి భక్తులు గంగమ్మను దర్శించుకోనున్నారు. ఎల్లుండి జాతర అఖరి రోజు కాగా చెంప నరకడంతో జాతర ముగుస్తుంది.





























