టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా..?

ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద పడింది. ఆయన ఎక్కడున్నారనే దానిపై పోలీసులు నిఘా పెంచారు. ఆయన కూడా తన అన్నలాగే పోలీసులకు లొంగిపోతారా? లేక పోలీసులే ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా..?
Pinnelli Brothers
Follow us

|

Updated on: Jun 30, 2024 | 9:55 PM

ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద పడింది. ఆయన ఎక్కడున్నారనే దానిపై పోలీసులు నిఘా పెంచారు. ఆయన కూడా తన అన్నలాగే పోలీసులకు లొంగిపోతారా? లేక పోలీసులే ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈవీఎంల ధ్వంసంతో పాటు పార్టీ కార్యాలయాలపై దాడులు, బాంబుల మోతలు, ఏజెంట్లపై ఎటాక్‌లతో రెండు రోజుల పాటు ఈ ప్రాంతం అట్టుడికి పోయింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందనే చర్చ అంతటా మొదలైంది. పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసి అడ్డువచ్చిన నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిపై పోలీసులు 307 హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

దీంతో పాటు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై దాడి చేయడమే కాకుండా టీడీపీ కార్యాలయం దగ్దం చేసిన ఘనటలోనూ పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు రెండు రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆయన అరెస్ట్ తరువాత అందరి దృష్టి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపైనే పడింది. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీఐపై దాడి ఘటన కేసులో వెంకట్రామిరెడ్డితో కూడా ఉన్నాడని పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరుల స్వగ్రామమైన కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావుని బెదిరించి దాడి చేసిన ఘటనలోనూ ఆయనపై హత్యయత్నం కేసు నమోదైంది. ఈ రెండు కేసులతో పాటు మరో ఏడు కేసుల్లో వెంకట్రామిరెడ్డి నిందితుడిగా ఉన్నారు.

పోలింగ్ జరిగిన మే 13 తర్వాత వెంకట్రామిరెడ్డి తన అన్న రామకృష్ణారెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అయితే అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి కౌంటింగ్ అయ్యేంత వరకు మధ్యంతర బెయిల్ పొందారు. ఆయన బెయిల్ రద్దు కావడంతో పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంతా జరగుతున్న వెంకట్రామిరెడ్డి అజ్ఞాతం వీడలేదు. ఆయన ఎక్కడున్నారన్నది ఆయన అభిమానులకు కూడా తెలియడం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు వెంకట్రామిరెడ్డి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకూ వెంకట్రామిరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంతో పోలీసులు తమ దృష్టి అంతా వెంకట్రామిరెడ్డి మీద పెట్టారని.. త్వరలోనే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి పిన్నెల్లి సోదరులు వ్యవహారం పల్నాడులో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..