AP Weather: ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో వరుణుడు నాన్ స్టాప్‌గా దంచుతున్నాడు. ఈ వర్షాలు మరో 3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఋతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు జైసల్మేర్, చురు, హిస్సార్, కర్నాల్, జలంధర్, తరంతరణ్ గుండా వెళుతుంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-గంగా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల అవర్తనము ఇప్పుడు తూర్పు జార్ఖండ్ & పరిసరాల్లో ఉంది. సముద్ర మట్టానికి సగటున 5.8 & 7.6 కిమీల మధ్య 20° ఉత్తర అక్షాంశము వద్ద గల గాలి కోత / షీర్ జోన్ ఇపుడు బలహీన పడినది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-ః
————————————
ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
రాయలసీమ :- —————-
ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
సోమవారం:-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..