రేషన్ అక్రమాలకు అడ్డాగా ఆ పోర్ట్.. మంత్రి నాదెండ్ల స్పెషల్ ఫోకస్..

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో తిష్ట వేసి అధికారులకు చెమటలు పట్టించారు. కాకినాడ పోర్టుతో పాటు జిల్లాలో పలు రైస్ మిల్లులపై రివ్యూ చేసి అక్రమ బియ్యం వ్యాపారంపై అధికారులను నిలదీశారు. అయితే నాదెండ్ల తరువాత పవన్ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైకిలింగ్ చేసి విదేశాలకు తరలించేవారిపై సమగ్ర విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

రేషన్ అక్రమాలకు అడ్డాగా ఆ పోర్ట్.. మంత్రి నాదెండ్ల స్పెషల్ ఫోకస్..
Minister Nadendla Manohar
Follow us

|

Updated on: Jun 30, 2024 | 8:05 PM

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో తిష్ట వేసి అధికారులకు చెమటలు పట్టించారు. కాకినాడ పోర్టుతో పాటు జిల్లాలో పలు రైస్ మిల్లులపై రివ్యూ చేసి అక్రమ బియ్యం వ్యాపారంపై అధికారులను నిలదీశారు. అయితే నాదెండ్ల తరువాత పవన్ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైకిలింగ్ చేసి విదేశాలకు తరలించేవారిపై సమగ్ర విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. మొదట పోర్ట్ ఏరియాలోని పలు గోదాముల్లో అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. ఇందులో ఆరు రైస్ మిల్స్ నుంచి పిడిఎఫ్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. రైస్ మిల్స్ వెనుక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి హస్తం ఉందంటూ చెప్పకనే చెప్పేశారు. ఇటు కాకినాడ పోర్ట్‌లో కూడా తిష్ట వేసి ద్వారంపూడి కుటుంబ దౌర్జన్యంగా అడ్డగోలుగా సముద్రంలో ఓడలు కొనే స్థాయికి ఎదిగారంటూ ఆరోపించారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

కాకినాడ జిల్లాలో ఒక రోజుతోనే సమీక్షలు సరిపెట్టుకోలేదు మంత్రి నాదెండ్ల. రెండో రోజు కూడా కాకినాడ జిల్లా పర్యటించారు. ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బియ్యం నిల్వల కేంద్రాలను తనిఖీలు చేశారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ప్రభుత్వం ద్వారా రవాణ చేస్తున్న బియ్యాన్ని నిజాయితీగా చేరేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా పనిచేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తనిఖీలు నిర్వహించిన పది ప్రాంతాల్లో ఏడు చోట్ల పీడీఎస్ బియ్యం ప్రెడింగ్ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయన్నారు. వీరందరి మీద లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ ప్రాంతాన్ని మాఫియాకు అడ్డాగా తయారు చేశారని, 2018-24 మధ్య చాలా మార్పు ఉందన్నారు. పీడిఎస్ బియ్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులు నిజాయితీగా పనిచేసి, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఆధారాలు దొరికిన చోట స్టార్ పేజ్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖలు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయన్నారు మంత్రి నాదెండ్ల.

నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే కాకినాడలో తిష్ట వేసి కాకినాడ పోర్టుపై దృష్టి సారించారు. దీనికి కారణం 2023 జూన్ – జూలైలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడ స్థానిక ప్రజల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద మొత్తంలో రేషన్ తరలిపోతున్నట్టు ఫిర్యాదు చేయడమే. ఈ నేపథ్యంలోనే పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, బాగోతాలు అధికారంలోకి రాగానే బయట పెడతానని కాకినాడ సభల్లో పవన్ కళ్యాణ్ నేరుగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జీవనాడైన పోర్టుపై దృష్టి పెట్టారు. మొదటిరోజు 5300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంతో పాటు రెండవ రోజు ఏడువేల మెట్రిక్ టన్లకుపైగా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. సముద్ర మార్గం ద్వారా ఓడల్లో ఆఫ్రికాకు తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని వెంటనే నిలిపివేయాలంటూ అధికారులకు సూచించారు. ఇంకా మారని అధికారులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఇది ఇక్కడితో ఆగదని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన వెనుకున్న అనుచరుల అక్రమాలన్నీ బయటపడతామని హెచ్చరించారు. జులైలో మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లాలో అధికారులతో సమీక్షించబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. వెల్లుల్లితో ఇలా చేస్తే..
గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. వెల్లుల్లితో ఇలా చేస్తే..
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'
మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన తర్వాత రీఫండ్‌ రాలేదా? ఇలా చేయండి!
మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన తర్వాత రీఫండ్‌ రాలేదా? ఇలా చేయండి!
సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్
పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్
ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం.. ఎంత పని చేశాడు..!
ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం.. ఎంత పని చేశాడు..!