AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. వాడవాడల్లో పర్యటిస్తూ..

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో రూ.3000 ఉన్న ఫించన్‎ను రూ. 4 వేలకు పెంచి టీడీపీ ప్రభుత్వం జూలై 1 నుంచి పంపిణీ చేస్తోంది. గత మూడు నెలలకు అనగా ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించిన రూ. 3వేల బకాయిలకు జూలై నెల పెన్షన్ రూ. 4000 కలిపి మొత్తం రూ.7వేలు చొప్పున ఇంటింటికీ పంపిణీ చేశారు. జూలై నెలలో ఒక్కొక్క లబ్ధిదారునికి రూ. 7 వేలు నగదు రూపంలోనే పంపిణీ చేయనున్నారు. జూలై నెలలో ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 3000 అదనపు భారం పడనుంది.

CM Chandrababu: పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. వాడవాడల్లో పర్యటిస్తూ..
CM Chandrababu
Srikar T
|

Updated on: Jul 01, 2024 | 6:54 AM

Share

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో రూ.3000 ఉన్న ఫించన్‎ను రూ. 4 వేలకు పెంచి టీడీపీ ప్రభుత్వం జూలై 1 నుంచి పంపిణీ చేస్తోంది. గత మూడు నెలలకు అనగా ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించిన రూ. 3వేల బకాయిలకు జూలై నెల పెన్షన్ రూ. 4000 కలిపి మొత్తం రూ.7వేలు చొప్పున ఇంటింటికీ పంపిణీ చేశారు. జూలై నెలలో ఒక్కొక్క లబ్ధిదారునికి రూ. 7 వేలు నగదు రూపంలోనే పంపిణీ చేయనున్నారు. జూలై నెలలో ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 3000 అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు 65లక్షల 18వేల496 మంది ఉన్నట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

తాడేపల్లి మండలం పెనుమాక‎లో స్వయంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా బానావత్ పాముల నాయక్‎కు వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్‎ను సీఎం చంద్రబాబు అందించారు. తమకు ఇల్లు కావాలని బాణావత్ నాయక్ సీఎం ను కోరడంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్దిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. అదే ఇంట్లో సుమారు 15 నిమిషాలపాటు వారితో ముచ్చటించారు. వారి సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో తనకు ఇల్లు లేదని.. పెన్షన్‎దారుడు వాపోవడంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్లు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, స్థానిక స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు.. అంతా మంచే జరుగుతుందని ఆ పేద కుటుంబానికి భరోసా కల్పించారు సీఎం చంద్రబాబు.

ప్రతి నెలా రూ. 3వేల నుంచి 4వేల రూపాయలు పెన్షన్లు అందించడంతో గతంకంటే ఈ ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 819 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 05.45 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి 06.00 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయం 06.00 నుంచి 06.20 వరకు ఎస్టీ కాలనీల్లో పర్యటించారు. ఆయా కాలనీల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఆ తరువాత 06.30 నుంచి 07.15 వరకు పెనుమాకలోని మసీదు సెంటర్‎లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో తొలి నెల పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..