TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ టెట్ నోటిఫికేషన్‎ తేదీ ప్రకటన.. పూర్తి వివరాలు..

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ముందుగా జూలై 1న ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ది, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే జులై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణను ప్రారంభించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ టెట్ నోటిఫికేషన్‎ తేదీ ప్రకటన.. పూర్తి వివరాలు..
Ap Tet Notification
Follow us
Srikar T

|

Updated on: Jul 01, 2024 | 7:18 AM

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ముందుగా జూలై 1న ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ది, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే జులై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణను ప్రారంభించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిన నేపథ్యంలో.. అతిత్వరలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్దమైంది ఏపీ సర్కార్.

ఇప్పటికే పెన్షన్ పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. నిరుద్యోగులకు కూడా తీపి కబురు అందించారు. మొత్తం 16వేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్‎తో పాటు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు కూడా అందించనుంది. జులై 2 నుంచి https://cse.ap.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా టెట్ దరఖాస్తులకు అప్లికేషన్ పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‎ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని కెరియర్, జాబ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..