Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన ప్రజలు.. గ్రామాలకు వెళితే.. తాళాలేసిన ఇళ్లు దర్శనం..

2024 ఎన్నికల్లో మళ్లీ సత్తాచాటాలని అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో దూసుకెళ్తోంది. సీఎం జగన్ సూచనలతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తూ.. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు.

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన ప్రజలు.. గ్రామాలకు వెళితే.. తాళాలేసిన ఇళ్లు దర్శనం..
Chittoor
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2023 | 9:45 AM

2024 ఎన్నికల్లో మళ్లీ సత్తాచాటాలని అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో దూసుకెళ్తోంది. సీఎం జగన్ సూచనలతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తూ.. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో వారు ప్రజలపై ఫైర్ అయ్యారు. తీసుకున్న ప్రభుత్వ పథకాలను రిటర్న్ ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు. తామేమీ.. ఓట్ల కోసం రాలేదని..

వైసీపీ ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న.. పూతలపట్టు మండలం పేట అగ్రహారం వాసులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెస్ బాబు పర్యటనను బహిష్కరిస్తూ ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్థులంతా వెళ్లిపోయారు. పేట అగ్రహారం పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ వాసులు మినహా.. గ్రామమంతా ఖాళీ అయింది. అయితే, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎస్సీ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొంది బహిష్కరించడాన్ని ఎమ్మెల్యే తప్పు పట్టారు. గడపగడపకు వస్తే తాళం వేసి వెళ్ళిన వారు లబ్ధి ఎలా పొందుతారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మేమిచ్చే డబ్బులు తీసుకుని.. ఇళ్ళ వద్దకు వేస్తే తాళం వేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిగ్గు రోషం ఉంటే పథకాలు వాపసు ఇవ్వండంటూ విమర్శించారు. ఇంతగా అవమానం చేసిన మీకు ఇకపై వంద శాతం పథకాలు రావు.. ఇవ్వం.. ఇక ఏమీ చేయం.. అంటూ స్పష్టంచేశారు. ఓట్ల కోసం రాలేదు, అభివృద్ధి కోసం వస్తే ఒక్క పథకం వద్దంటున్నారు.. సిగ్గు ఉంటే తీసుకున్న పథకాలన్నీ వాపసు ఇవ్వండి అంటూ.. పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సూచించారు. ఇదిలాఉంటే.. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పర్యటించిన తర్వాత.. టీడీపీ క్యాడర్ రంగంలోకి దిగింది. గ్రామాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసింది. ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్ళిపోయిన గ్రామస్థులు, టీడీపీ నేతలు పసుపు నీళ్లతో గ్రామాన్ని శుభ్రం చేసుకున్నారు.

ఇదిలాఉంటే.. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంకు తాళాలు వేసిన ఇల్లు దర్శనమిచ్చాయి. నారాయణ స్వామి వస్తున్న విషయం తెలుసుకొని ఇళ్లకు తాళాలు వేసి జనం వెళ్లిపోయారు. ఊరంతా ఖాళీ అవ్వడంతో అవాక్కయిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి అసహనానికి గురయ్యారు. సర్పంచ్ తో పాటు గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో అనర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని అప్పటికప్పుడు కలెక్టర్ ను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న ఇళ్లలో జనం ఎందుకులేరని డిప్యూటీ సిఎం అధికారులను ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..