Perni Nani: తిట్టడానికే సభ పెట్టారు.. చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్..
సిద్ధం అంటూ వైసీపీ కదన రంగంలోకి దిగితే.. జెండా చేత పట్టి సంసిద్ధం అంటూ తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ, జనసేన గర్జించింది. అధికార పార్టీ టార్గెట్‌గా చంద్రబాబు, పవన్ నిప్పులు చెరిగారు. అయితే జెండా సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు అంతకు మించి అనేలా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ పలికిన ప్రతి పదానికీ తమదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి పేర్నినాని.
సిద్ధం అంటూ వైసీపీ కదన రంగంలోకి దిగితే.. జెండా చేత పట్టి సంసిద్ధం అంటూ తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ, జనసేన గర్జించింది. అధికార పార్టీ టార్గెట్‌గా చంద్రబాబు, పవన్ నిప్పులు చెరిగారు. అయితే జెండా సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు అంతకు మించి అనేలా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ పలికిన ప్రతి పదానికీ తమదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. పవన్ డైలాగులకు పేర్ని నాని కౌంటర్ ఇస్తూ.. యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామని పవన్ అన్నారని.. 2014, 2019లో ఏం చేశారంటూ ప్రశ్నించారు. తాడేపల్లి సభను పవన్, చంద్రబాబు వైఎస్ జగన్ ను తిట్టడానికే పెట్టారంటూ పేర్ని నాని పేర్కొన్నారు. ప్రజలకు సందేశం ఇచ్చే బదులు.. జగన్ ను దూషించడానికే సభను పెట్టారంటూ వివరించారు.
24 సీట్లకే పవన్ సరిపెట్టుకోవడంపైనా పేర్ని కౌంటర్ ఇచ్చారు. వామనుడిలా వైసీపీని తొక్కేస్తానని పవన్ అంటే.. దానం చేసిన వాళ్లెవరూ, తొక్కేదెవరినీ అంటూ పేర్కొన్నారు. తనతో స్నేహమైనా, వైరమైనా చచ్చేదాకా అని పవన్ అంటే.. మరి ఈ పిల్లి మొగ్గలు ఏంటి అంటూ పేర్ని నాని కౌంటరిచ్చారు.
జగన్ ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘటనలపై పవన్ విమర్శలు చేస్తే.. మీ సంగతి ఏంటో చూసుకోండంటూ పేర్ని నుంచి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




