Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతి వేళ్లకు నాగ బంధం, కూర్మం పెద్ద ఉంగరాలు.. ఎలాంటి యోగాన్ని ఇస్తాయంటే..!

Pawan Kalyan’s finger Rings: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏది చేసిన సంచలనమే.. నడిచిన స్టైల్ లే , మాట్లాడిన స్టైల్ లే, మేడ పైన చేయి పెట్టి రుద్దిన స్టైల్ లే.. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ పెట్టుకున్న బంగారపు ఉంగరాలు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ చౌరస్తాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. అసలు జనసేనాని చేతి వేళ్లకి ఏం పెట్టుకున్నారనేగా మీరు ఆలోచిస్తున్నారు. అయితే, చదవండి. పవన్ కల్యాణ్ కుడి చేతి వేళ్లలో ఓ వేలికి తాబేలు, నాగ అంగుళికంను ధరించారు పవన్ కల్యాణ్. ఇంతకాలం కనిపించని ఉంగరాలు ఇప్పుడు కనిపించడంతో ఈ చర్చ మొదలైంది. ఎందుకు పెట్టుకున్నారని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతి వేళ్లకు నాగ బంధం, కూర్మం పెద్ద ఉంగరాలు.. ఎలాంటి యోగాన్ని ఇస్తాయంటే..!
Pawan Kalyan’s Finger Rings
Follow us
M Sivakumar

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 18, 2023 | 6:34 PM

పవన్ స్టార్ట్ పవన్ కల్యాణ్ .. ఈ పేరు అందరికి సుపరిచితమే.. అయితే ఎప్పుడు చాలా సింపిల్ గా ఉండే పవన్ కల్యాణ్ ఉంగరాలు ధరించడం వెనుక కథ ఏంటి అని అభిమానులు తెగ హైరానా పడిపోతున్నారు. సినిమా, రాజకీయరంగాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే పవన్ కల్యాణ్.. ఈ మధ్య ఉంగరాలతో కనిపించేడం.. అందులోనూ నాగ బంధం, కూర్మం పెద్ద ఉంగరాలు.. ధరించడం ప్రత్యేకంగా మారింది. అయితే, సినిమా, రాజకీయ రంగాల్లోని వ్యక్తులు ఇలాంటి సెంటిమెంట్లను అనుసరించడం మనం చాలా సార్లు చూశాం. అందులో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినిమా రంగాల్లోని ప్రముఖలను ఇలాంటి ధరించడం కామన్.

అయితే,  దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయం నుంచి రాజకీయాల్లో ఇవి మారింత పెరిగాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఒకే దుస్తులను ధరిస్తూ ఉంటారు. అలాగే పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డ్రస్ కోడ్ ను షడన్ గా మార్చేశారు. పాదయాత్రలో వాడిన ఖాకి రంగు ప్యాంట్ తెలుపు రంగు చొక్కా ను జగన్ సీఎం అయినా తర్వాత కూడా వదలలేదు.. అది జగన్ కు సెంటిమెంట్ గా మారిపోయింది.

బాలకృ‌ష్ణ, మోహన్ బాబు..

ఇది ఇలా ఉంటె హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జోతిష్యం, హస్తవాస్తుపైన బాగా నమ్మకం. నిత్యం దేవుని పూజ చేసి రాహుకాలం, వర్జ్యం చుడనిదే కాలు బయటపెట్టారని చెప్పుకుంటారు. అలాగే విక్టరీ వెంకటేష్ వివేకానంద ఆధ్యాత్మిక వైఖరిని అనుసరిస్తారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు ఎప్పుడు సాయి నామసమరణలో ఉంటారు.

ఇవి కూడా చదవండి

రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన తర్వాత బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు జనసేనాని. అప్పుడు అందరి దృష్టి ఆ ఉంగరాలపై పడింది.

ఆ రెండు ఉంగరాల్లో ఒకటి..

అప్పుడే పవన్ కల్యాణ్ చేతి వేళ్లకు ఉన్న ఆ రెండు ఉంగరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఉంగరాల్లో ఒకటి నాగ బంధం, మరొకటి కూర్మం. ఈ రెండు బంగారు ఉంగరాలు కూడా సైజులో చాలా పెద్దగా ఉండటం మరింత ఆకర్శనీయంగా కనిపించాయి. పవన్ కల్యాణ్ ఎందుకు ధరించారు.. దీని వెనుక  బలమైన కారణం ఏదైనా ఉందా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఈ దంతా ఒక్కటైంతే తాజాగా అయన చేతికి ఉన్న ఉంగరాలు కొత్త చర్చకు తెరలేపాయి.. ప్రస్తుతం పవన్ కుడి చేతి వేళ్లకు రెండు ప్రత్యక ఉంగరాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటి.. ఎందుకు ధరిస్తున్నారని అభిమానులలతో పాటు రాజకీయ వర్గల్లో కూడా చర్చజరుగుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అందరి చూపు ఆయన ఉంగరాలపై పడింది. పవన్ ధరించిన దుస్తులు ,నాగ అంగుళీకాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఆ ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణంగా మారింది.

ఆ రోజుల్లో పగడం ఉంగరాన్ని కూడా దరిస్తారంట..

రాజకీయాల్లో అనుకూల ఫలితాలు రావాలనే ఈ రెండు ఉంగరాలు ధరించారని కొంతమంది భావిస్తున్నారు. వీటితో పాటు మంగళవారం , శని సమయంలో పగడం ఉంగరాన్ని కూడా దరిస్తారంట.. ముఖ్యంగా తాబేలు ఉంగరాన్ని కుర్మా ఉంగరం అంటారు.. అధికార యోగంతో పాటు ధన యోగం ఇస్తుందని అంటున్నారు. ఇవి ఉంటె అన్ని విజయాలు తమవెంటే ఉంటాయని నమ్మకం. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో ఈయన కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందాని పండితులు చెప్తున్నారు.

ఈ సెంటిమెంట్లు  కలిసొచ్చి..

తాబేలు ఉంగరం పెట్టుకుంటే అందరికి కలిసిరాదని కొందరు జోతుషులు చెప్తున్నారు. అవి కొన్ని ప్రత్యక రాశుల వారికి మాత్రమే కలిసి వస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఇవి పెట్టుకున్న వారికి ఇబ్బందులు తొలగిపోయి విజయాలు సాదిస్తారంట.. అంతే కాకుండా ఉంగరం పెట్టుకోవడం వలన దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంటాయని అంటున్నారు.  జోతిష్యల సలహా మేరకే పవన్ కల్యాణ్ ఈ ఉంగరాలు ధరించారని చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం పవన్ కల్యాణ్ ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడంలేదని ఇదంతా చూస్తుంటే అనిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్లు  కలిసొచ్చి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారేమో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం