అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు

అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు

Phani CH

|

Updated on: Sep 18, 2023 | 7:44 PM

మహిళ అంతిమ యాత్రలో కాల్చిన కాకర్స్ గ్రామంలో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడగా మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలిపెట్టి బంధువులు వెళ్లిపోయారు. చివరికి పోలీసుల జోక్యంతో అంతిమ యాత్ర సజావుగా సాగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన వృద్దురాలు నాగేంద్రమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాగేంద్రమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో కాకర్స్ కాల్చారు.

మహిళ అంతిమ యాత్రలో కాల్చిన కాకర్స్ గ్రామంలో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడగా మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలిపెట్టి బంధువులు వెళ్లిపోయారు. చివరికి పోలీసుల జోక్యంతో అంతిమ యాత్ర సజావుగా సాగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన వృద్దురాలు నాగేంద్రమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాగేంద్రమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో కాకర్స్ కాల్చారు. అయితే అలా కాలిన కాకర్స్ గంగాధర్ కు చెందిన వరి గడ్డి వామిపై పడ్డాయి. దీంతో వరి గడ్డి అగ్నికి ఆహూతైంది. గడ్డి వామి తగలబడటంతో నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులతో గంగాధర్ కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటలు దాటి చేతల వరకూ ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలి పెట్టి నాగేంద్రమ్మ బంధువులు వెళ్లిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??

Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల

చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!

నాగలి పట్టే రైతులు క్రికెట్‌ బ్యాట్‌ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు

కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో