కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

Phani CH

|

Updated on: Sep 18, 2023 | 7:31 PM

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ పోటీలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రింగ్ లో ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తూ, పిడిగుద్దులతో విరుచుకుపడే రెజ్లర్లు అదే రింగ్ లో సరదాగా చిందేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత నలుగురు సూపర్ స్టార్లు ఆస్కార్ అందుకున్న పాటకు కాలుకదిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులను అలరించారు. తమ అభిమాన ఫైటర్లు అందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసి డ్యాన్స్..

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ పోటీలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రింగ్ లో ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తూ, పిడిగుద్దులతో విరుచుకుపడే రెజ్లర్లు అదే రింగ్ లో సరదాగా చిందేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత నలుగురు సూపర్ స్టార్లు ఆస్కార్ అందుకున్న పాటకు కాలుకదిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులను అలరించారు. తమ అభిమాన ఫైటర్లు అందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసి డ్యాన్స్ చేయడం చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చప్పట్లతో వేదిక మొత్తం దద్దరిల్లింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ స్పెక్టాకిల్ తొలి మ్యాచ్ లో భారత స్టార్ రెజ్లర్లు వీర్ మహాన్, జిందర్ మహాల్, సంగా పాల్గొన్నారు. వీరితో వెటరన్ స్టార్లు కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, డ్రూ మెకింటైర్ పోటీపడ్డారు. నలుగురి మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్.. హైడ్రామాతో ఆరుగురి మధ్య పోటీగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??

నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్‌ ఆవేదన