PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోడీ.. పవన్‌తో భేటీ.. పీఎం రెండు రోజుల షెడ్యూల్ ఇదే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నేటినుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం పీఎం మోడీ.. విశాఖపట్నం చేరుకోనున్నారు.

PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోడీ.. పవన్‌తో భేటీ.. పీఎం రెండు రోజుల షెడ్యూల్ ఇదే..
Pawan Kalyan Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2022 | 5:15 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నేటినుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం పీఎం మోడీ.. విశాఖపట్నం చేరుకోనున్నారు. అనంతరం రోడ్ షో.. బీజేపీ నేతలతో సమావేశం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ ఇలా.. ప్రధాని మోడీ పర్యటన బిజిబిజీగా కొనసాగనుంది. పీఎం మోడీ విశాఖ షెడ్యూల్ ఏంటి? ప్రధాని వైజాగ్ చేరుకునేది ఎప్పుడు? అక్కడి నుంచి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు? అనే విషయాన్నింటిని ఇప్పుడు చూద్దాం..

ప్రధాని మోడీ వైజాగ్ షెడ్యూల్ ఇలా..

  • శుక్రవారం రాత్రి 7. 25 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి బై రోడ్ నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్‌ చోళాకు బయలుదేరుతారు.
  • మార్గమధ్యంలో ఏడున్నర నుంచి 7.45 వరకూ కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ఎనిమిదింటికి చోళాకు చేరుకుంటారు.
  • రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత పది నిమిషాల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తో భేటీ అవుతారు. ఇక రాత్రి 8. 40 నుంచి పీఎం షెడ్యూల్ రిజర్వ్.
  • నవంబర్ 12న శనివారం ఉదయం 9 గంటల నుంచి తిరిగి ప్రధాని షెడ్యూల్ రీ స్టార్ట్ అవుతుంది. తొమ్మిదింటి నుంచి వీఐపీ అపాయింట్మెంట్స్ ఉంటాయి.
  • తర్వాత బై హెలికాఫ్టర్ ద్వారా పదీ పదికి ఏయూకి బయలుదేరుతారు. పదిగంటల ఇరవై ఐదు నిమిషాలకల్లా ఏయూకు చేరుకుంటారు. పదిన్నరకల్లా వేదిక దగ్గరకు చేరుకుంటారు ప్రైమ్ మినిస్టర్.
  • వేదికపై నుంచి వర్చువల్ గా 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన, రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం పదకొండున్నర నుంచి పదకొండుముప్పావు వరకూ ప్రధాని ప్రసంగం ఉంటుంది.

ఉదయం 11 నలభై ఐదుకు ఎయిర్ పోర్టుకు బయలు దేరుతారు. మధ్యాహ్నం పన్నెండుగంటలకల్లా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పన్నెండూ ఐదు నిమిషాలకు ప్రధాని ప్రయాణించే ప్రత్యేక విమానం.. టేకాఫ్ తీస్కుంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటా పదినిమిషాలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టులో ల్యాండవుతారు. అనంతరం రామగుండంలో ఎరువుల ప్రారంభోత్సవానికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

విశాఖలో ఏర్పాట్లు పూర్తి..

ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుంచి 2 లక్షల మంది.. మిగతా నాలుగు జిల్లాల నుంచి లక్ష మంది దాకా ప్రజలు హాజరవుతారని చెప్పారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కాగా..  ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..