Pawan Kalyan: వైసీపీ నేతల కామెంట్స్‌పై పవన్ పంచ్‌లు.. ట్విట్టర్ వేదికగా పోస్టులు..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మంత్రులు, జనసేనాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సినిమా ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మంత్రులు, జనసేనాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సినిమా ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఎవరి వెర్షన్ వారిదే. ఇలా వైసీపీ వెర్సస్, జనసేన మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
”తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే” అని పేర్కొంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే తనకిష్టమైన పాట ఇదేనంటూ ఓ సాంగ్‌ను కూడా పవన్ పోస్ట్ చేశారు.
తుమ్మెదల ఝుంకారాలు నెమళ్ళ క్రేంకారాలు ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
Also Read: