Ox Race: ఏపీలో విజయదశమి పండుగ వేడుకలు.. అద్భుతంగా బండలాగుడు పోటీలు
కడపజిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విజయదశమి పండుగ వేడుకలు గ్రామస్తులు సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో
Bull Race competition: కడపజిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విజయదశమి పండుగ వేడుకలు గ్రామస్తులు సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించారు. మూలె గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు నిర్వాహకులు.
విజయదశమి పండుగను పురస్కరించుకుని దసరా సంబరాల్లో భాగంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లానూ ఎద్దుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జతలు వివిధ విభాగాల్లో బండరాయిల్ని లాగి బహుమతులు గెలుచుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న ఎడ్లజతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని ఇచ్చి గౌరవిస్తున్నారు నిర్వాహకులు.
Read also: వీటితోనే భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు పెనుప్రమాదం పొంచి ఉంది.. ఆర్ఎస్ఎస్ చీఫ్ దసరా పండుగ స్పీచ్