DL Ravindra Reddy: రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన శాస్తి జరిగిందంటూ మాజీ మంత్రి సంచలన కామెంట్స్
Ex-Minister DL Ravindra Reddy: ఏపీలో రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన శాస్త్రే జరిగిందంటూ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన కామెంట్స్..
Ex-Minister DL Ravindra Reddy: ఏపీలో రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన శాస్త్రే జరిగిందంటూ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు తాను వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయలలోకి రానున్నానని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వక పోయినా పోటీ చేస్తానని డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రకటించారు. కాజీపేటలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న డియల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎల్.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారి పోయారని, రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారన్నారు. ఇక నుంచైనా ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి బ్రతక వద్దని సూచించారు. భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పని అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
కడప జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. డీఎల్ ఏ పార్టీలో చేరుతున్నాడా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది అయితే.. ఆయన తిరిగి రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏపార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనే విషయంపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read: వధువుకు ప్రేమతో 60కేజీల బంగారం నగలు గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. మోయలేక అష్టకష్టాలు పడిన పెళ్లికూతురు..