Chinese Bride: వధువుకు ప్రేమతో 60కేజీల బంగారం నగలు గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. మోయలేక అష్టకష్టాలు పడిన పెళ్లికూతురు
Chinese Bride Wears 60 kg Gold Jewelry: మనదేశంలో మగువులకు బంగారం అంటే ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగ, ఫంక్షన్ ఇలా..
Chinese Bride Wears 60 kg Gold Jewelry: మనదేశంలో మగువులకు బంగారం అంటే ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగ, ఫంక్షన్ ఇలా ఏ సందర్భం వచ్చినా బంగారం, వెండి అధిక ప్రాధాన్యతను సొంతం చేసుకుంటుంది. అయితే మన దేశంలోనే కాదు.. మన పొరుగు దేశమైన చైనాలో కూడా పెళ్ళిళ్ళల్లో బంగారం నగలు కొనడం సంప్రదాయంగా వస్తుంది. తాజాగా ఓ పెళ్లి కొడుకు తనకు కాబోయే భార్యకు పెళ్లిలో ధరించడానికి కొన్న నగలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే.. వరుడు తనకు కాబోయే భార్యకు గిఫ్ట్ గా ఇచ్చిన నెక్లెస్లను, గాజుల బరువుని మోయలేక అష్టకష్టాలు పడింది. ఈ సంఘటన చైనాలోని హుబయ్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
వధువు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి ఎన్నో కలలను కంటూ.. తెల్లని వివాహ గౌనులో చేతిలో ఎర్రగులాబీల బొకేతో అందంగా ముస్తాబైంది. ఇంతలో వధువుకు కాబోయే భర్త వచ్చి.. ఆమెకు వివాహకనుకగా బంగారం నగలు ఇచ్చాడు. పెద్ద పెద్ద పెద్ద నెక్లెస్ లు, భారీ బంగారు గాజులు ఉన్నాయి. పెళ్లిళ్లలో భర్త తరుపు వారు ఇచ్చే నగలను ధరించాలనే ఆచారం చైనాలో ఉంది. అందుకే కాబోయే భర్త ఇచ్చిన బంగారపు భారీ వస్తువులను కష్టమైనా ఇష్టంగా ధరించింది. వరుడు ఇచ్చిన మొత్తం బంగారం నగల బరువు 60 కేజీల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకొక్క నెక్లెస్ కేజీకి తక్కువ కాకుండా బరువు ఉన్నాయట.
వరుడు చాలా ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి అట.. అందుకనే తనకు కాబోయే భార్యను ఇలా బంగారంలో ముంచెత్తాడట. అయితే ఇంత బరువువైన నగలను ధరించిన వధువు వివాహ వేదికకు రావడానికి అష్టకష్టాలు పడిందట.. పెళ్లి కొడుకు సాయంతో ఎంతో కష్టం మీద వేదికకు చేరుకుంది. వధువు నగలు ధరించి పడుతున్న ఇబ్బందులు ఆహుతులకు కూడా జాలి కలిగించిందట. ఒక సమీప బంధువు వధువుకు సాయం చేయడానికి చేయి అందించబోతే.. తిరస్కరించి.. తాను సంప్రదాయాన్ని గౌరవిస్తానని చెప్పిందట.. ఇక చైనాలో కూడా బంగారం తమ హోదాకు చిహ్నం గా భావిస్తారు. అందుకనే పెళ్లి కూతురు అంత బరువువైన వస్తువులను ధరించి పెళ్లి చేసుకుంది.
Also Read: కాందహార్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 13మందికి గాయాలు