Afghanistan Blast: కాందహార్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 13మందికి గాయాలు
Blast at Mosque in Afghanistan: ఆఫ్గనిస్తాన్ లోని దక్షిణ ప్రావిన్స్‌లోని కాందహార్ లోని ఇమామ్ బార్గా మసీదు సమీపంలోభారీ పేలుడు సంభవించింది..
Blast at Mosque in Afghanistan: ఆఫ్గనిస్తాన్ లోని దక్షిణ ప్రావిన్స్‌లోని కాందహార్ లోని ఇమామ్ బార్గా మసీదు సమీపంలోభారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దక్షిణ నగరంలోని సెంట్రల్ హాస్పిటల్ కి తరలించారు.
శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా షియా వర్గానికి చెందిన మసీదులో పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇంకా ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఏ గ్రూప్ ప్రకటించలేదు.
అంతకుముందు ఇదే నెల 8వ తేదీన ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని మసీదులో జరిగిన పేలుడులో కనీసం 100 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Also Read: జమ్మి చెట్టు ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి.. ఎడారి ప్రాంతవాసులకు కల్పవృక్షం.. ఎందుకంటే