Afghanistan Blast : శుక్రవారం ప్రార్థనల వేళ దద్ధరిల్లిన మసీదు.. 32మంది మృతి, 53 మందికి తీవ్ర గాయాలు
ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాందహార్ లోని మసీదు దగ్గర ఆత్మాహుతి దాడిలో 32 మంది చనిపోయారు. 53 మందికి తీవ్రగాయాలయ్యాయి. షియా వర్గాన్ని
Afghanistan’s Kandahar: ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాందహార్ లోని మసీదు దగ్గర ఆత్మాహుతి దాడిలో 32 మంది చనిపోయారు. 53 మందికి తీవ్రగాయాలయ్యాయి. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి పాల్పడింది ఎవరన్న విషయంపై ఇంకా సమాచారం లభించలేదు. ఈ దాడి వెనుక ఐసిస్ ఉగ్రవాదుల హస్తమున్నట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.
కుందూజ్‌లో వారం రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో 60 మంది పౌరులు చనిపోయారు. కాందహార్ మసీదులో భీకర దృశ్యాలు కన్పించాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శుక్రవారం ప్రార్ధనలు జరగగానే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Read also: Ox Race: ఏపీలో విజయదశమి పండుగ వేడుకలు.. అద్భుతంగా బండలాగుడు పోటీలు