AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏం మనిషివిరా నువ్వు.! బాలింత వదినకు లిక్కర్ తాగించబోయిన మరిది.. అన్న వచ్చీరాగానే

అంకన్న నాగన్నలు సొంత అన్నదమ్ముల బిడ్డలు. అంకన్న హత్యకు గురికావడంతో అతని భార్య, పిల్లలు అనాధలుగా మారారు. కళ్ళముందే భర్త హత్యకు గురికావడంతో భార్య పసి కందుని ఎత్తుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. హత్య చేసిన తర్వాత నాగన్న పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు.

Andhra: ఏం మనిషివిరా నువ్వు.! బాలింత వదినకు లిక్కర్ తాగించబోయిన మరిది.. అన్న వచ్చీరాగానే
Representative Image
Fairoz Baig
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 21, 2025 | 4:21 PM

Share

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద మంతనాల చెంచుగూడెంలో కుటుంబ కలహాల కారణంగా జరిగిన హత్య కలకలం రేపింది. అన్న వరుసయ్యే అర్తి అంకన్నను తమ్ముడు అర్తి నాగన్న కత్తితో గుండె‌పై పొడవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. అంకన్నను దోర్నాలలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే అంకన్న మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బాలింత అయిన అంకన్న భార్యకు నాగన్న మద్యం తాగించడంతో దీనిపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

బాలింతగా ఉన్న తల్లికి సారా ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు పెదనాన్న కొడుకును చిన్నాన్న కొడుకు హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పెద్దమంతనాల గిరిజనగూడెంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పెద్దమంతనాలకు చెందిన అర్తి నాగన్న అతని అన్న కొడుకైన అర్తి అంకన్న(27)ను చాకుతో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. అర్తి అంకన్న, అతని తండ్రి రామారావు హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లి దోమతెర కర్రలు అమ్ముకుని సాయంత్రం ఇంటికి చేరేసరికి తన భార్య దేవమ్మకు నాగన్న మద్యం తాగించేందుకు ప్రయత్నిస్తుండగా దేవమ్మ భర్త అంకన్న చూశాడు. నెలల పిల్లాడితో ఉన్న తన భార్యకు మద్యం ఎందుకు పోస్తున్నావని నాగన్నను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఘర్షణ పెద్దది కావడంతో నాగన్న విల్లంబుతో దాడి చేయగా అంకన్న అంబును విరిచేశాడు. అంతటితో ఆగక తన దగ్గర ఉన్న కత్తితో అంకన్న గుండెపై బలంగా పొడిచాడు. అంకన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాగన్న అక్కడ నుంచి పారిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆటోలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే అంకన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడు నాగన్న కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి