AP Govt Jobs: ప్రకాశం జిల్లాలో 64 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ/ ప్రభుత్వ జనరల్ హాస్పటల్‌లలో 64 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ/ ప్రభుత్వ జనరల్ హాస్పటల్‌లలో 64 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఫొరెన్సిక్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన వారు మే 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించాలి. జూన్1, 2023వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ..
rimsongole@yahoo.com
కౌన్సెలింగ్ అడ్రస్..
Conference Hall, Government Medical College, Ongole.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.