AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger: మెరుపులా వచ్చి మాయమవుతున్న పులి.. గజగజ వణికిపోతున్న కాకినాడ జిల్లా ప్రజలు..

పాదముద్రల ఆధారంగా ఈ పులి రాయల్‌ బెంగాల్‌ (royal bengal tiger) జాతికి చెందినదని వయస్సు నాలుగైదేళ్లు ఉంటుందని, బరువు సుమారు 180 కేజీల ఉంటుందన్నది అటవీ అధికారుల అంచనా.

Tiger: మెరుపులా వచ్చి మాయమవుతున్న పులి.. గజగజ వణికిపోతున్న కాకినాడ జిల్లా ప్రజలు..
The Royal Bengal Tiger
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2022 | 8:39 PM

Share

Kakinada district: కాకినాడ జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన పులిని బంధించేందుకు లేదా అడవిలోకి తిప్పి పంపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పులి సంచరిస్తున్న ప్రాంతంలో దట్టమైన సరుగుడు తోటలు ఉండటం, మరో వైపు పులి మెరుపులా వచ్చి మాయమవుతుండటంతో దాన్ని పట్టుకోవడం అధికారులకు కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో కాకినాడ జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా వారిని పులి భయభ్రాంతులకు గురిచేస్తోంది. పాదముద్రలు, కదలికలు, వేటాడే తీరును బట్టి ఈ పులి రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందినది అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పాదముద్రల ఆధారంగా ఈ పులి రాయల్‌ బెంగాల్‌ (royal bengal tiger) జాతికి చెందినదని వయస్సు నాలుగైదేళ్లు ఉంటుందని, బరువు సుమారు 180 కేజీల ఉంటుందన్నది అటవీ అధికారుల అంచనా. దీని పొడవు ఆరున్నర అడుగులు ఉంటుందని భావిస్తున్నారు.

ఏ క్షణాన, ఎక్కడి నుంచి పులి వచ్చి పంజా విసురుతుందో అనే భయం కాకినాడ జిల్లా ప్రజలకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. ఒమ్మంగి, పోదురుపాక,ఉత్తరకంచి, పాండవులపాలెం చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతోంది. పెద్దపులి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడప దాటాలన్నా .. గట్టుకి వెళ్లాలన్నా భయంతో హడలిపోతున్నారు. పిల్లా పెద్దలంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. పశువుల్ని కూడా పంటపొలాలకు తీసుకెళ్లేందుకు వెనకాడుతున్నారు.

ఈ ఉదయం మరో ఆవుపై దాడి చేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఫారెస్ట్ అధికారులు. చుట్టుపక్కల గ్రామస్తులు చీకటి పడిన తర్వాత బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పులిని బంధించేందుకు లేదా అడవిలోకి పంపించేందుకు శ్రీశైలం నుంచి మరో టీమ్ రప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో