Tirupati: టెంపుల్ సిటీలో కోవిడ్ కలకలం.. చికిత్స పొందుతూ కోవిడ్‌తో ఒకరు మృతి
తిరుపతి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ కేసుల సంఖ్య 20 కి చేరుకుంది. గత వారం రోజులుగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిన్న రుయాలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 16 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా ఇసోలేషన్ వార్డులో 20 కోవిడ్ తో చికిత్స పొందుతున్నట్లు రుయా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్..
తిరుపతి, జనవరి 4: తిరుపతి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ కేసుల సంఖ్య 20 కి చేరుకుంది. గత వారం రోజులుగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిన్న రుయాలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 16 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా ఇసోలేషన్ వార్డులో 20 కోవిడ్ తో చికిత్స పొందుతున్నట్లు రుయా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అనుమానితులుగానే గుర్తించాలంటున్న వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పెనుమూరుకు చెందిన వృద్ధురాలు చికిత్స పొందుతూ కోవిడ్‌తో మృతి చెందింది. మెడికల్ విభాగంలోని ప్రత్యేక వార్డులో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న రుయా వైద్యులు అనుమానిత లక్షణాలున్న వారు ట్రయాజ్ సెంటర్ లో పరీక్షలు చూసుకొని వైద్య సహాయం పొందాలని కోరుతున్నారు.
మరో ఘటన.. హైదరాబాద్‌లో భారీగా నకిలీ యాంటీబయాటిక్స్ పట్టివేత
నకిలీ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న ముఠాను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 22.95 లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్‌లోని ట్రాకాన్ కొరియర్స్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించగా ఐదు కార్టన్లలో నకిలీ ఔషధాలు బయటపడ్డాయని డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి పువ్వాడ లక్ష్మణ్ పేరుతో కొరియర్‌లో వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
కాగా లక్ష్మణ్‌పై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని గోదాములో కార్టన్లను డెలివరీ ఇస్తుండగా లక్ష్మణ్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ద్వారకాపురంలో అతడు శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పేరుతో అక్రమంగా గోదాము నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యూపీ నుంచి ఈ పార్శిళ్లు వచ్చాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మెగ్ లైఫ్‌సైన్సెస్‌లో తయారైన ‘సెఫోక్సిమ్-సీవీ’ ట్యాబ్లెట్లు 51 వేల వరకు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అది ఇల్లీగల్ కంపెనీ అని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.