AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ZIM: దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్ జోస్యం.. అనుకున్నదే జరిగిందిగా

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ పరాజయం పాలైంది. ఈ ఓటమికి ముందే పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ భారత జట్టు సెమీస్‌కు చేరడం కష్టమని, బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతుందని జోస్యం చెప్పాడు. అమీర్ అంచనాలు నిజమవడంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, అమీర్ వీడియోలు వైరల్‌గా మారాయి.

IND Vs ZIM: దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్ జోస్యం.. అనుకున్నదే జరిగిందిగా
Team India
Ravi Kiran
|

Updated on: Feb 24, 2026 | 1:14 PM

Share

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న 76 పరుగుల భారీ పరాజయం క్రీడా ప్రపంచంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ పేరు మారుమోగిపోతోంది. దీనికి ప్రధాన కారణం మ్యాచ్ ప్రారంభానికి ముందే అమీర్ చేసిన సంచలన వ్యాఖ్యలు. భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరడం కష్టమని, టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతుందని అమీర్ జోస్యం చెప్పాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమీర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

అయితే, అచ్చం అమీర్ ఊహించినట్టుగానే భారత బ్యాటింగ్ లైనప్ సఫారీ బౌలర్ల ముందు పేకమేడలా కూలిపోవడం గమనార్హం. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ వైఫల్యాన్ని అమీర్ ముందే ఎత్తి చూపడం అతని అంచనాలకు మరింత బలం చేకూర్చింది. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న అమీర్, యాంకర్ తనను జ్యోతిష్యుడు అని పిలవగానే పగలబడి నవ్వుతూ, “దేవుడా, నన్ను క్షమించు, నాకేంటిది?” అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. భారత జట్టు ఓటమిని చూసి అమీర్ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలు, నవ్వుతున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి.

ఇక ఈ మ్యాచ్ విశ్లేషణలోకి వెళితే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైందని చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ మరియు యువ ఆటగాడు డివాల్డ్ బ్రెవిస్ బాధ్యతాయుతమైన ఆట తీరుతో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్పిన్నర్ ఎయిడెన్ మార్క్రమ్ వేసిన తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ డకౌట్ కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా మార్కో యాన్సెన్ వేగవంతమైన బంతులకు సమాధానం చెప్పలేక పెవిలియన్ చేరారు. మిడిల్ ఓవర్లలో శివం దూబే చేసిన 42 పరుగులు భారత్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో టీమ్ ఇండియా కేవలం 111 పరుగులకి ఆలౌట్ అయింది.

ఈ ఘోర పరాజయంతో భారత నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోవడమే కాకుండా, సెమీ-ఫైనల్స్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌ల సమీకరణలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పుడు భారత్ తన తదుపరి పోరులో జింబాబ్వేను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఎదుర్కోనుంది. ఒకవేళ అక్కడ కూడా ఏమరుపాటుగా ఉంటే, అమీర్ అన్నట్టుగానే భారత్ సూపర్ 8 నుండే నిష్క్రమించే ప్రమాదం పొంచి ఉంది. అమీర్ చేసిన విమర్శలు నిజమవ్వడం భారత మేనేజ్‌మెంట్‌కు ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us