YS Sharmila: ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు.

YS Sharmila: ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
YS Sharmila
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2024 | 1:52 PM

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చిన నిర్వర్తిస్తానని స్పష్టంచేశారు. ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా అంటూ.. వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఈరోజు వైఎస్ఆర్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేయండం సంతోషంగా ఉందన్న షర్మిల.. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అంటూ కొనియాడారు..ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని.. అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమంటూ షర్మిల పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి అశయమని.. దానికి అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల, అనిల్ దంపతులు సోనియా గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..