పెరుగు తింటే శ్వాసకోస సమస్యలు వస్తాయా..?

24  February 2026

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పేగుల‌ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే పెరుగును తిన‌డంపై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి

TV9 Telugu

ముఖ్యంగా పెరుగు తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌రువు పెరుగుతార‌ని అనుకుంటారు. నిజానికి పెరుగు శ‌రీరానికి ఎలాంటి హాని క‌లిగించ‌దు. పెరుగు తీసుకునే స‌మ‌యం, దానిని ఎలా తీసుకుంటున్నారు అనే విధానంపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి

TV9 Telugu

పెరుగు క‌డుపు నిండిన అనుభూతిని క‌లిగిస్తుంది. దీనిలో ప్రోబ‌యోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో జీవ‌క్రియ‌ను పెంచుతాయి. త‌ద్వారా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగి శ‌రీర బ‌రువు త‌గ్గుతుంది

TV9 Telugu

పెరుగును క్రమం త‌ప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. జీవ‌క్రియ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. తాజా పెరుగు జీర్ణక్రియకు మేలు చేస్తుంది

TV9 Telugu

పేగు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. అయితే పుల్లని పెరుగు, ఎక్కువ‌గా పులిసిన పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల పేగు ఆరోగ్యం స‌రిగ్గా లేని వారిలో జీర్ణ స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది

TV9 Telugu

అలాగే పెరుగు తింటే శ్లేష్మం పెరిగి ద‌గ్గు, జలుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్యలు వ‌స్తాయ‌నే అపోహ కూడా ఉంది. కానీ పెరుగు తిన‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్యలు వ‌స్తాయన‌డం వెనుక ఎటువంటి ఆధారాలు లేవ‌ని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

శ‌రీర సున్నిత‌త్వం వ‌ల్ల మాత్రమే ఇటువంటి స‌మ‌స్యలు తలెత్తుతాయి. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సమస్యలు రావు. చాలా మంది రాత్రి స‌మ‌యంలో పెరుగును చాలా మంది తిన‌రు

TV9 Telugu

కానీ చ‌క్కని జీర్ణవ్యవ‌స్థ క‌లిగిన వారు రాత్రి భోజ‌నంలో పెరుగును తీసుకోవ‌చ్చు. అయితే వేయించిన ఆహారాలు, చ‌క్కెర‌ల‌తో క‌లిపి పెరుగును తీసుకోకూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది