Hyderabad: పెళ్లింట విషాద ఛాయలు.. చికిత్స పొందుతూ నేడు నవ వధువు మృతి.. నిన్న వరుడు మృతి
Hyderabad: నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు కంటూ పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులు కలిసి వధువు పుట్టింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి..
Hyderabad: నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు కంటూ పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులు కలిసి వధువు పుట్టింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందాడు. అదే యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన నవ వధువు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఈరోజు మృతి చెందింది. దీంతో పచ్చని పందిరి, బంధువులు, సందడి సంతోషంతో కళకళలాడాల్సిన వధూవరుల ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరి లింగం పల్లి కి చెందిన శ్రీనివాసులుకు, తమిళనాడుకు చెందిన కనిమొళితో వివాహం జరిగింది. తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ జంట చెన్నై వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసులు తన భార్య కనిమొళితో కలిసి అత్తారింటివెళ్తుండగా కారు ప్రమాండ జరిగింది. ఈ ఘటనలో నవ నరుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన వధువు కనిమొళి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్ళైన 24 గంటలు గడవక ముందే శ్రీనివాసులు ప్రాణాలు పోగొట్టుకోగా.. చికిత్స పొందుతూ ఈరోజు వధువు కనిమొళి మరణించింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: